రాజకీయ నాయకుల్లారా
మీరు ప్రజల ప్రతినిధులు
ఏలకులు కాదు పరిపాలకులు
ప్రజల సేవకులు, క్షేమకారకులు!
పదవిని అలంకారంగా భావించండి
అహంకారమయితే దహించివేస్తుంది
స్వేచ్ఛ ఎగిరే పావురంలా ఉండాలి
పంజరంలోని చిలుకల్లా బందించకండి!
పత్రికలు సమాచార పత్రాలు
అవి కావు మీ కరపత్రాలు
ప్రజల అభిప్రాయాలకు
అక్షర దర్పణాలు
నిత్య సత్య దర్శనాలు!
అధికార కోటలు కూల్చడానికి
గన్నులే కావాలా పెన్నులు చాలు!
తెలుసుకోని మసులుకోండి!
ప్రజల్లో కలిసిపోండి!!
కష్టాల్లో ఆదుకుంటే
కడుపులో పెట్టుకోరా ప్రజలు?!
జగ్గయ్య.జి
984952580