సంస్థానాల భూమి వెనకబడినప్పుడు
ఏలేటోడు ఉత్తరాదివాడైనప్పుడు
కోపాన్ని దాచుకొని కూలీపనులు చేసినప్పుడు
గోస చెప్పుకోవడానికి మనోడు కాదనుకున్నప్పుడు
పాలమూరు మౌనంగా నిలబడింది
అడవిలో ఉండే జింకలు పులి రాకను
గమనించి బిత్తర చూపులతో పరిగెత్తినట్లు
అడవి పులివలే అసెంబ్లీకి వస్తున్నాడని
నడిచే ప్రతిచోటా ప్రతిపక్షానికి వణుకు పుడుతుందని
గోల్కొండ కోట కింద చప్పట్లు కొడితే
కోట మీద వినబడుతున్నట్లు
నల్లమల కొండల నుంచి వేసిన కూత
అసెంబ్లీ హాలు దాకా వినబడుతుంటదని
ఇప్పుడు పాలమూరు మాట్లాడుతుంది
ముఖ్యమంత్రికి ముందుమాటగా నేనుంటానని
వలసలు వెళ్లి అలసిన బతుకులతో
పల్లెరుగాయలు తొక్కి బాట వేసిన గొర్లకాపరులతో
అడ్డరోడ్డు దాకా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చిన అవ్వతో
ఇప్పుడు పాలమూరు మాట్లాడుతుంది
సింహాసనమెక్కింది మన నల్లమల ముద్దుబిడ్డేయని....
- ఎజ్జు మల్లయ్య
96528 71915