నవ తెలంగాణ వచ్చింది...!

poem

Update: 2023-12-10 18:30 GMT

నల్ల దొరలు ఏలుతున్న తెలంగాణ పోయి

నాలుగు కోట్ల ప్రజలకు నవ తెలంగాణ వచ్చింది

తెలంగాణ గుండెల్లో బతుకమ్మ పండుగ

బతుకమ్మ చిత్తములో బోనాల జాతర..!

లక్షల మంది యువత లక్ష్యం నెరవేరింది

కోట్లాది బడుగుల చిరకాల కోరిక తీరింది

అమరుల కుటుంబాలకు ఆత్మశాంతి దొరికింది

బుధవర్గాలకు సరైన ఆదరణ వేదిక లభించే...!

రేసు గుర్రం లాంటి రేవంత్ రెడ్డి రేడు

కాంగ్రెస్ పార్టీకి కాకతాళీయంగా దొరికే

దొరలు దోపిడీ పాలనలో

దొరలిన ప్రజల కన్నీరును

ప్రజా దర్బార్‌లో నిలబడి తుడిచె..!

సోనా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధిని

చూసి తెలంగాణ జనత తెగ మురిసిపోయే

పదేళ్ళ తర్వాతైనా కాంగ్రెస్‌కి పట్టం కట్టిన

తెలంగాణా ప్రజల కృతజ్ఞతలు చూసి

గాంధీ కుటుంబీకులు మందహాసాలు చేసే..!

త్యాగ ధనులతో తెచ్చుకున్న తెలంగాణను

బంగారు తెలంగాణగా రంగు మార్చే వరకు

ప్రతీ ఒక్కడూ ఒడలు వొంచి పరిశ్రమించాల్సిందే ..!

తెలంగాణను కోటి రత్నాల వీణగా చేసి మీటాలి ..!!

- జి.సూర్యనారాయణ

6281725659

Tags:    

Similar News

తొడుగు