మలి సంధ్య

poem

Update: 2023-11-27 00:15 GMT

జీవితం పడమటి సంధ్యా రాగం

పాడుతున్న వేళలో

పేరు తెలియని వ్యాధులు ఒక్కొక్కటి

పరిచయాలు పెనవేసుకుని

దేహంతో స్నేహం చేస్తున్నాయి

జీవితం చిన్నదైపోయింది

ఇక మిగిలిన ప్రతి క్షణానికి

విలువ పెరుగుతోంది

ఏమో ఎవరు చెప్పగలరు

కొన్నాళ్ళకు నేను చెప్పేది

నీకు వినపడకపోవచ్చు

నా మసకబారిన కళ్ళకు

నీ రూపం ఆనకపోవచ్చు

తోడు లేనిదే గోడ దాటలేని స్థితిలో

మౌనంగా నైనా ఎదురు పడలేము

అందుకే ఇప్పుడే అప్పుడప్పుడు

మాట్లాడుకుంటుంటే

పోయేదేముంది బాధలు తప్ప!

మిగిలేది జ్ఞాపకాలే!

డా. చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Tags:    

Similar News

తొడుగు