'పట్టు' గోడు

poem

Update: 2023-11-26 23:45 GMT

మా నుండి దారాలు తీస్తారు

ప్రాణాలు హరించి

తీసిన దారాలతో పట్టు శాలువాలు

తయారు చేస్తారు

నాయకులు శాలువాలు కప్పుకొని

సభలకి ఊరేగింపులకి

ప్రమాణ స్వీకారాలకి వెళ్తారు

నిజానికి 'పట్టుకు' గుర్తింపు లేదు

దానికి ఏ బాధా లేదు

పట్టుకు ఏ స్వార్థం లేదు

ప్రాణ త్యాగాలు లెక్కలేదు

దుఃఖమల్లా

శాలువాలు కప్పుకున్న వాళ్ళెవరూ

'విలువలు ' కాపాడడం లేదనే

కోటం చంద్రశేఖర్

9492043348

Tags:    

Similar News

తొడుగు