పార్టీ ఫిరాయించు
కిరాత నాయకులకిక
చరమగీతం పాడుదాం
ఆవేశం కాదు
ఆలోచించి ఓటేద్దాం
పచ్చనోట్లు పుక్కిలించకు
ఏరులై పారే మద్యానికి బానిసకాకు
పవిత్రమైన ఓటే
పరమౌషధంగా భావించు
ఐదు నిమిషాల్లో తేల్చేసి
అగమ్యగోచరం కాకు
ఐదు సంవత్సరాలు
ఫలితం అనుభవించాలి
నిన్నటి రోజు మరచిపో
రేపటి ఉజ్వల భవిష్యత్తుకు
ఊపిరిపోసే అమూల్యమైన
ఓటును ప్రాణప్రదంగా చూసుకో
ప్రలోభాలకు లొంగక
ఆచితూచి ఆలోచించు
ఓటు విలువ తెలుసుకో
మనిషిగా మసులుకో
కొరుప్రోలు హరనాథ్
9703542598