పండగ వచ్చిందోయ్...
పండగ వచ్చింది
ఐదేళ్లకోసారి వచ్చే
ఓట్ల పండగ వచ్చింది
వీధి వీధిలో సందడి తెచ్చింది
నాయకులంతా, దండాలు పెడుతూ
కనిపించిన ప్రతీవాడి
భుజంపై చెయ్యేసి
మనవాడే మన చుట్టమే, అన్నట్టుగా
మాటల మంత్రాలు వేస్తూ
ఓటు నాకే వెయ్యాలంటూ
చేతిలో చెయ్యేసి చెప్తూ,
నోటు చేతిలో పెట్టి
నడుపుతారు రాజకీయ తంత్రాలు..
అందరిలోకి తామే మంచోళ్ళు
ఎదుటి పార్టీలు మోసగాళ్లంటూ
అయోమయంలో పడేస్తారు
ఓ ఓటరన్నా.. జర జాగో
చల్లగా సేదతీర్చే మంచు ఏదో
కణకణ మండే నిప్పు ఏదో తేల్చుకో
మంచి ఏదో మనసుతో ఆలోచించుకో
రేపటి ప్రభుత్వానికి
వంగి వంగి దండాలు పెట్టాలో
తప్పుచేస్తే తప్పుకోమని నిగ్గదీయగల్గాలో
నిర్ణయం నువ్వే తీసుకో
నీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకో
దేవలపల్లి సునంద
9291599562