బర్రెలక్కను నేను
బరిగీసి దిగుతున్న
పాడైపోయిన రాజకీయాలలో
పవిత్రున్నని కంపు నోరుతో
చెప్పుకునే నాయకులతో
ఓట్ల సమరంలో
పంజరంలో బందిని కాను
పంజరాన్ని పగల గొట్టి
ఎన్నికల పందేరంలో దిగాను
నా బాల్యం కమ్మనైన కావ్యం కాదు, కన్నీటి వ్యధ
ఉపాధి చూపని పాలనపై కసి
కసినాకు మసిపులుముకున్న
రాజకీయం అంటే
ఓట్ల వ్యాపారం చేసే నాయకుల పై కసి
నేటి యువత
బీతి లేక, రీతి లేక, నీతి తప్పి
మందు రుచులలో
మత్తుగా నిదుర పోతున్నారు
ఎందరికో నీడ లేదు, ఆశలేదు ధనం లేదు
వారికి మార్గాన్నవుత!
పాలకులంతా మోసాలతో
స్వార్ధాలతో సంపాదనకు
తెగబడుచున్నారు
పంట చేనులో ఒక మొక్కకు
చీడ పడితే మొత్తం చేనుకే చేటు
పాలకుడు మలిన పడితే, సమాజానికే చేటు
నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి
నాకు కొంచం నమ్మకమీయండి
మీ తలలో నాల్కనై, చట్ట సభలలో
మీ గొంతునై ఉరుముత
కుళ్లిన రాజకీయాన్ని కడుగుత
పాంహౌస్ ల్లేవు, ప్యాలేశ్‌లు లేవు
ఓటుకు నోటు ఇవ్వలేను
నాకు ఓటేయండి
నాలాంటి వారికి నమ్మక మీయండి.......
(బర్రెలక్క అనే చెల్లి సాహసానికి, ఎందరికో స్ఫూర్తి నిచ్చే తన ధైర్యానికి నా అక్షరాలతో అభిషేకం..)
నారగోని ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త
98490 40195