రాజకీయ రణక్షేత్రంలో
ఎన్నికల జోరు..
హోరాహోరీ పోరు..
మాటల తూటాలు..
ప్రతిపక్షానికి కౌంటర్లు..
సొంత డబ్బాలు..
హామీల తాయిలాలు..
ఇంటింటి సందర్శనాలు..
వంగి వంగి దణ్ణాలు..
ఇప్పుడు ఓటర్లే దేవుళ్ళు..
పాలకులే సేవకులు..
గద్దెనెక్కాక అంతా తారుమారు
తీన్మార్లే........
మళ్ళీ ఐదేళ్ళ వరకూ
మంచిగున్నవ అనేటోళ్లే ఉండరు..
తాయిలాలకు అలవాటు పడిన
ఓటరు మహాశయులారా..!
ఆలోచించి ఓటు వేయండి..
మీరు తీసుకునే ఒక్క నోటు -
ఐదేళ్ళ మీ జీవితపు తాకట్టు..
భవిష్యత్తరాలకు గొడ్డలిపెట్టు.. !!
కందాళ పద్మావతి
తెలుగు పండితులు
90108 87566