బస్సెక్కితే ఫ్రీ...
సుట్ట కాలిస్తే ప్రోత్సాహకాలు...
పెళ్లయితే కట్నం...
విడిపోతే కోర్టు సాయం..
రోగమొస్తే వైద్యసాయం..
రోగం రాకుంటే తెప్పిస్తాం..
కలిసుంటే విడగొడతాం!
నలతగా ఉంటే మేం వండి పెడతాం
తింటే అరగ్గొడతాం తినకుంటే తినిపిస్తాం
ఇల్లు లేకుంటే కట్టిస్తాం
ఉంటే ప్రాజెక్టుల్లో ముంచేస్తాం!
బతికినోళ్లను చంపేస్తాం
చనిపోయిన వాళ్ళను ఓట్ల కోసం బతికిస్తాన్
వితంతు పించను మరో తంతు ఇచ్చేస్తాం!
చావుకి సబ్సిడీ ఇస్తాం
బతికితే బాదేస్తం
తాగితే సన్మానిస్తాం
తాగకుంటే పన్నులు కట్టిస్తాం!
ఇంకా చాలా చాలా చేస్తాం
గెలిస్తే మీ అంతు చూస్తాం
కానీ అది తెలియకుండా చూస్తాం
చేయాల్సింది ఆపేస్తాం!
వద్దన్నది తప్పక చేస్తాం
అదే మా తీరని నొక్కి వక్కాణిస్తాం
తెలుసుకోకుంటే మీ కర్మ
అని అంగలారుస్తాం..
చొప్పదండి సుధాకర్
91773 48349