కన్నీరేది...?

poem

Update: 2023-11-13 00:15 GMT

నెత్తురతో తడారుతున్న నేల

పెను భయాలతో కమ్మేస్తున్న మేఘం

కంట కన్నీరు కూడా

ఆవిరయిపోయే ఆక్రందనలు

కన్నపేగు బంధం కంటిముందే

కనుమరుగవుతుంది

నిస్సహాయ స్థితిని నిందిస్తూ

కళ్ళుండీ చూడలేని కసాయి కాలం

అధికార అంగబలాన్ని

అధిరోహించలేని బలహీనం

నేర్చుకున్న జ్ఞానం

చదివిన చదువు అజ్ఞాన

రంగును పులుముకుంది

క్రూరత్వాన్ని నరనరాలలో నింపుకుంది

విలయ తాండవాన్ని తిలకిస్తుంటే

మరో రోజు కోసం ఆలోచనేది

బ్రతుకు మీద ఆశేది

మరో కళింగను తలపిస్తున్నా

గుర్తుకు రానీ బుద్ధుని భోధనలు

వినపడని శాంతి హితువులు

ఎగరలేని శాంతి పావురాలు

మనుషులంతా మరమనుషులయ్యారు

యావత్తు యుద్ధ ఛాయలు అలుముకుని

నిశి వీధుల వెంట దేశాంతరాలకు

పయనమయ్యే సమయం ఆసన్నమాయే..

యం. లక్ష్మి

తెలుగు అధ్యాపకులు

Tags:    

Similar News

తొడుగు