అనుభవించుండ్రీ

poem

Update: 2023-11-05 18:30 GMT

పడి పడి మొక్కుండ్రీ

పోర్లదండలు వెట్టుండ్రీ

కళ్ళు వట్టుండ్రీ

కోట్లు కుమ్మరియ్యుండ్రీ

ఆంగి మొక్కుండ్రీ ఆశీర్వాదిచుమనుండ్రీ

కడుప కడుపకు తిరిగి కానికరించుమనుండ్రీ

ముడ్డి కడుగుండ్రీ, మూతీ తుడువుండ్రీ

ఓట్లు ఎయ్యుమనీ గెలిపియ్యుమనీ

గులాబీ నోటు కిసాల గుచ్చుండ్రీ

నాల్కే మర్రకుంట మందు వోయ్యుండ్రీ

మా కోసం ఏం జేత్తరనీ అడగకుంట

ఇన్ని రోజులు ఏం జేసిండ్రనీ నీలదియ్యకుంట

గెలిసెదాక కడుపులో పెట్టుకొని సుసుకుంటమని

వాగ్దానాలు ఇయ్యుండ్రీ కండ్లల్ల వెట్టుకుని

కావలుంటమని బాండ్ పేపర్ రాసియ్యుండ్రీ

గెలిసినంక కలుద్దామన్నా కానరకుంట తిరుగుండ్రీ

మాల్ల ఎలక్షన్ల దాక మర్రిసుడకుండ్రీ

ఏది నీ పనితనమనీ ఎంబట వడీ అడిగితే

నువ్వు నాకు ఓటు ఏసినవా అని ఎదురు మాట్లాడుండ్రీ

గుద్దల నరం బీకీ గుటంకు కట్టిపియ్యుండ్రీ

ఐదేండ్ల దాకా ఇంకోడు అడుగకుంట

ఏం జేసిన ఎవడు ఎదురు చెప్పకుంట,

అధికార బలం సుపియ్యుండ్రీ

ఎక్కడికక్కడ అణగదోక్కిపియ్యుండ్రీ

ధర్నాలు చెయ్యకుండా దోక్కల పోడుండ్రీ

సమ్మెలకు సైరన్ ఉదకుండా సెల్లో పెట్టుండ్రీ

మల్లోసారి ఎలుకోమ్మనీ మీకు అమ్ముడువోకుండ

నక్క జీత్తుల మాటలు శేష్టలు నమ్మకుండా

లిక్కర్ కు ఆశా పడ్డా లేకి తనంకు

ఓటు విలువ తెలిసోచ్చేదాకా

నోటుకు జై కొట్టిన అపర్శనకు సోయికచ్చే దాకా

మేం ఐక్యమయ్యేదాకా అనుభవించుండ్రీ

జి.యం.నాగేష్ యాదవ్

94948 93625

Tags:    

Similar News

తొడుగు