కాసేపటి సంతోషం.... కావొద్దూ విషాదం....!!

poem

Update: 2023-10-22 22:45 GMT

కాసేపటి సంతోషం -

కాకూడదు విషాదం...!

కక్కుర్తి వ్యవహారం -

కడకు అవుతుంది మహా వ్యర్థం...!!

ఏది మంచి...ఏది చెడు -

ఎన్నటికీ తెలిసేది...!

ఏళ్ళకేండ్లు అవుతున్నా -

మనలో వచ్చే మార్పేది...!!

అంతా అయిపోయినాక -

ఆలోచిస్తే ఏం లాభం...!

ఆగమాగం గాయిగాయి -

గత్తరయితే ఏం సుఖం...!!

అదును చూసి దున్నితేనే-

భూమి చదును అవుతుంది...!

పదును చూసి విత్తితేనే-

గింజ మొలకెత్తుతుంది...!!

భవితవ్యం బాగుకై- బాధపడేదెవ్వరు...!

అందలం ఎక్కినంక- అనగదొక్కెటోలెవ్వరు....!!

అవకాశం వచ్చినప్పుడే- ఆలోచన చెయ్యాలే...!

అస్సలు ఏదో..మోసమేదో..- గుర్తెరిగీ నడవాలే....!!

ఆచితూచి అడుగేసి - మనం మంచి వైపు నిలవాలి...!!

అద్భుత భవితవ్యం... జనం సొంతమై నిలవాలి...!!

- బొల్లెద్దు వెంకట్ రత్నం

99636 16381

Tags:    

Similar News

తొడుగు