అగ్ని శకలాల మధ్య ఎందరి ఆక్రోధాలు
ఆవేశంతో గర్జిస్తున్నాయో
అంతరంగంలో మరుగుతున్న
కన్నీటి పర్యంతం బద్దలవుతుంది
కాటికి పోవాల్సిన పాత్రలే అన్నీ
నాటక ప్రపంచంలో నటించడంలో మునిగి
అంతా రంగుల లోకమే అనుకుంటున్నారు
బొమ్మ బొరుసులా పలు విధాలుగా
పాట్లు పడుతూ దేని కోసమో మరి
గద్దలా కాచుకుని కూర్చున్నారు
విగత జీవాలుగా పడాల్సిన వాళ్ళం మనం
వింత చేష్టలతో ఎందుకు
ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం
గమ్యం చేరాలన్న ఆకాంక్ష గతో తప్పితే
పూలదారిలో పయనం చాలా వేగంగా
విజృంభిస్తుంది
ఆశ కోసం జీవించు, ఆశగా ఎదుగు
బలగాన్ని సంపాదించుకో, బరువులను కాదు
బొమ్మ బొరుసులా అస్సలు బ్రతకకు....
పోలగాని భాను తేజశ్రీ
98665 97260