ప్రియతమా....
నువ్వు నాకు శిశిరంలా తోస్తావు
నువ్వు నా వైపు చూసిన ప్రతిసారీ
నేనో పండుటాకులా రాలిపోతాను
నీ కళ్ళల్లో మేఘాలను చూసిన ప్రతిసారి
నాలోని రుతువులు మారిపోతాయి
వేసవి వేడిమి మరిచిపోయి
తొలి తొలి చినుకుల కోసం
నా హృదయం ఎదురు చూస్తుంది.
- హిమజ
94414 92737