ఆ పదం పురుడుకు
సరిగ్గా ముందురోజు
నిజం హత్యకు గురికావడం బాగా గుర్తు..
సాక్ష్యం కోసం దేహమంతా దండోరాతో
అనుభవ మూలల్లో వెతికి పట్టిన
కలం ఎట్టకేలకు నోరు విప్పి
ఒక్క పదానికి ఊపిరంది
పొడవాటి వాక్యం జరజరా బయటకొచ్చింది
గడ్డకట్టిన కాలం కరగసాగింది
ఆలోచన తేమకు
ఆవిరవుతున్న అజ్ఞానానికి
మెరుస్తున్న శబ్దం ఉరుముతున్న అర్థంతో
పురివిప్పిన చైతన్యం కళ్లల్లో కవాతు చేసింది
ఆ ఒక్క పదం చుట్టూ
వేల పదాలు చేతులు వేసుకుంటూ
జట్లు జట్లుగా భావాలు
చీకటి ముఖంపై తెల్లగా కురిసింది
నిజం నిప్పుల మధ్యలో
మెత్తగా మొలకెత్తినది ..
చందలూరి నారాయణరావు
97044 37247