మనిషికి రాజకీయ చైతన్యం అవసరం

Man needs political consciousness

Update: 2023-11-19 18:45 GMT

అన్ని అబద్ధాల ముచ్చట్లు. చక్కెర చిలుకల మాటలు నిజం కాని దాన్ని నమ్మిస్తరు. ఆడంగ ఆడంగ నిజమని నమ్ముతారనే విశ్వాసం ఎదుటోని మీద బట్ట కాల్చి మీద ఎయ్యాలె. ఎదుటి వాడు తక్కువ తిన్నడా తానూ లేనిపోనివి కల్పిచ్చుడు బొంకిచ్చు బోర్లే సుడు బోల్తా కొట్టిచ్చుడు. మనుషుల కంటే జ్ఞాపక శక్తి తక్కువ. పోయిన ఎన్నికల్ల ఎమన్నవుర నీ మ్యానిఫెస్టోల ఏం రాసినవు ఏం చేసినవు అని అడిగే స్థితి లేదు. నీతులు చెప్పతాంటి నీతి మంతుడు అనుకునుడు గిట్లనే గడిచిపోతుంది. ఎలక్షన్ల మాయా మర్మం నడుస్తుంది ఓటర్లను ఎవలు ఎక్కువ మాయ చేస్తే వాల్లే గెలుస్తారు వాని మనుసుకు గెలిచినవాడే గెలుస్తడు. ఇది వరకు ఇంటిదిక్కు సూడని వాడు పోయినా కలువని వాడు ఇప్పుడు ఇల్లు ఇల్లు తిరుగతరు నగరం నగరం తిరుగుతరు. ఒక్కసారి ఎక్కువే ఇగ అయిదేండ్ల దాకా పరాకత్. ఒక్కసారి రాజ్యం వస్తే ఇగ మస్తు వైభోగాలు రాజరికాలు తరతరాలు కొనసాగుతది.

రాజ్యం అన్నంక కొంత ప్రజాస్వామికత కన్పించాలె. చట్టం, న్యాయం, ధర్మం, నీతి నిజాయితీ అనేవి ఇదివరకటి కంటే మరింత సమున్నతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటరు. మరి 75 ఏండ్లల్ల ఏమైంది, పూర్తిగా ఆధ్వాన్నం తయారైంది. నీతికి అవినీతికి తేడా లేదు. లంచాలు పైసలు దళారితనం మాట తప్పడం అనేవి ఒకప్పుడు ఇజ్జత్ అనిపించేవి ఇప్పుడు వాటికే విలువ పెరిగింది. అదే సాలు కొనసాగతంది. అయితే రాజ్యాంగం ప్రకారం పౌర హక్కులు, చట్టాలు అమలు కావడం లేదు. అయినా పట్టింపు లేకుండా అయ్యింది. ఎన్నికలలో ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో చూస్తున్నం. ఇవి ఎట్లా సమకూర్చుకుంటారు ఎందుకు ఇంత ఆర్భాలు ఎందుకు ఓట్లను కొంటున్నారు. ఇవేం పట్టని తరం కూడా తయారైంది. ప్రజాస్వామిక ఆలోచనలకు కూడా రాకుండా పోయినయి.

ఏది ఏమైనా రాజ్యం అంటే కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. కొంత స్వేచ్ఛ సమానత్వం సమభావం పరిఢవిల్లాలి. అందరిని కోతిని చేసి ఆడిచ్చుడు కాదు కొన్ని ప్రశ్నలు ఉదయించనివ్వాలె కొంత చైతన్యం రావాలి. అందుకు అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలి. ఏది ఏమైనా మార్పు చైతన్యం కొత్తదనం నూతన ఆలోచనలు అవసరమైన సందర్భం.

- అన్నవరం దేవేందర్

94407 63479


Similar News

తొడుగు