అమెరికా ముఖాన ధిక్కార రాజీనామా!

Contempt resignation in the face of America!

Update: 2023-11-19 18:30 GMT

గాజా ప్రజలకు ఆత్మస్థైర్యం నింపడానికి రచయితలు ఇరవై నాలుగు గంటల పాటు ప్రదర్శన చేయాల్సి రావడం చాలా ఇబ్బందికరంగా తయారైంది. గాజాపై కొనసాగుతున్న బాంబు దాడులను నిరసిస్తూ బుధవారం రాత్రి నేషనల్ బుక్ అవార్డ్స్ జాబితాలోని డజను మంది రచయితలు ప్రదర్శన నిర్వహించారు. మర్నాడు, గురువారం తెల్లారేసరికల్లా ఒక వార్త సంచలనమైంది.

కవిత్వంలో పులిట్జర్ అవార్డు గ్రహీత, వ్యాస రచయిత్రి, న్యూయార్క్ టైమ్స్ కవిత్వ విభాగం ఎడిటర్ అన్నేబోయర్ తన పదవికి రాజీనామా చేశారు. ‘అమెరికా మద్దతుతో గాజాపై ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఎవరికి సంబంధించినది కాదు’ అని ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘ఎవరైతే ఈ అసంబద్ధమైన బాధకు మనల్ని అలవాటు చేశారో, అలాంటి వారి ‘సహేతుకమైన’ గొంతుల మధ్య కవిత్వం గురించి నేను రాయలేను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గాజా యుద్ధం గురించి పత్రికా యజమానికి అన్నే బోయర్ రాసిన లేఖలో సూటిగా ఆమె మాటల్లోనే..

‘న్యూయార్క్ టైమ్స్ మేగజైన్ పొయిట్రీ ఎడిటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అమెరికా మద్దతుతో గాజాపై ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఎవరికి సంబంధించినది కాదు. దీనిలో ఎవరికీ భద్రత లేదు.. ఇజ్రాయిల్‌కే కాదు, అమెరికాకే కాదు, యూరప్‌కే కాదు, తమ పేరుతో యుద్ధం చేస్తున్నారని అపవాదు మోస్తున్న యూదు ప్రజలకే కాదు. ఏ ఒక్కరికీ భద్రత లేదు. ఇది కేవలం చచ్చేంత వచ్చే పెట్రో లాభాల కోసం, ఆయుధ తయారీదారుల లాభాల కోసం. ఈ ప్రపంచం, భవిష్యత్తు, ప్రతి ఒక్కటీ ఘనీభవించి, కుంచించుకుపోతాయి. ఇది మిసైళ్ళ యుద్ధమో, నేల కోసం దండయాత్రో కాదు. తమని బలవంతంగా తరలించటానికి, లేమికి, ముట్టడికి, జైలుపాలు చేయడానికి, హింసించడానికి వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి ఉపాధి కోసం ప్రతిఘటిస్తున్నందుకు ఈ యుద్ధం కొనసాగుతున్న పాలస్తీనా ప్రజల విధ్వంసం ఎందుకంటే ఇది మా స్వీయ వ్యక్తీకరణ కోసం. ఒక్కొక్కసారి కళాకారులంతా తిరస్కారంగా వదిలేస్తారు. అందుకనే నేను తిరస్కరిస్తున్నాను. ఎవరైతే ఈ అసంబద్ధమైన బాధకు మనల్ని అలవాటు చేశారో, అలాంటి వారి ‘సహేతుకమైన’ గొంతుల మధ్య కవిత్వం గురించి నేను రాయలేను. పిశాచాల మాటలను అందంగా చెప్పలేను. నరకలోకపు భాషకు తేనెపూసి చెప్పలేను. ఇక యుద్ధాన్ని కాంక్షించే అబద్ధాలు లేవు. ఒకవేళ ఈ రాజీనామా లేఖ కవిత్వ రూపంలో వార్తల మధ్య ఘాతంలా కనిపిస్తే, ఇప్పుడున్న స్థితికి ఇది నిజమైన రూపం’. అంటూ అన్నే బోయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారు.''

అన్నే బోయర్ వ్యక్తం చేసిన ఆమె గుండె ధైర్యం మరికొంత మంది రచయితలకు ప్రేరణైతే, మనస్సాక్షి లేని ఈ యుద్ధానికి వ్యతిరేకంగా వారు కూడా ఈ వేదికపై నుంచి మాట్లాడతారు.

అనువాదం

రాఘవ శర్మ

94932 26180

Tags:    

Similar News

తొడుగు