గ్రేటర్‌లో రూ.613 కోట్ల మద్యం విక్రయాలు
దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు మద్యం ఏరులై పారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రచారం ముగిసే వరకూ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గ్రేటర్ లో మొత్తం రూ.613 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. బల్దియా ఎన్నికలను నేపథ్యంలో సాధారణ రోజుల కంటే 40 శాతం అమ్మకాలు అధికంగా జరిగాయి. గ్రేటర్ లో ఈ నెల 17 నుంచి 29 వరకూ హైదరాబాద్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు మద్యం ఏరులై పారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రచారం ముగిసే వరకూ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గ్రేటర్ లో మొత్తం రూ.613 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. బల్దియా ఎన్నికలను నేపథ్యంలో సాధారణ రోజుల కంటే 40 శాతం అమ్మకాలు అధికంగా జరిగాయి. గ్రేటర్ లో ఈ నెల 17 నుంచి 29 వరకూ హైదరాబాద్ జిల్లాలో రూ.154 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.317 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.42 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.100 కోట్లు చొప్పున అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, బల్దియా ఎన్నికల ఫలితాల తర్వాత మరో రెండ్రోజుల పాటు మద్యం విక్రయాలు జోరు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబరు 29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.2,239 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, ఈ ఏడాది నవంబరు 29 నాటికి రూ.2,567 కోట్ల విక్రయాలు జరిగాయి.