ఫ్రూట్ మార్కెట్ కార్మికుల మెరుపు సమ్మె
దిశ, ఎల్బీనగర్: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మెరుపు సమ్మెకు కారణం మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ అనుసరించే విధానాలే కారణమని చెప్పారు. సమ్మె విషయాన్ని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పండ్ల మార్కెట్‌ను ఈనెల 23వ తేదీలోగా బాటసింగారం తరలించాలని అధికారుల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 9, 10వ తేదీలలో మార్కెటింగ్ అధికారులు ఇక్కడి, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. అప్పటి […]
దిశ, ఎల్బీనగర్: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మెరుపు సమ్మెకు కారణం మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ అనుసరించే విధానాలే కారణమని చెప్పారు. సమ్మె విషయాన్ని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పండ్ల మార్కెట్‌ను ఈనెల 23వ తేదీలోగా బాటసింగారం తరలించాలని అధికారుల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 9, 10వ తేదీలలో మార్కెటింగ్ అధికారులు ఇక్కడి, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి మార్కెట్‌ను తరలించవద్దని, అన్ని వసతులు ఏర్పాటు చేసాకే కొహెడకు తరలించాలని పండ్ల మార్కెట్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ధఫాలుగా పోరాటాలు చేయడం జరిగిందని కార్మికులు వివరించారు. మార్కెంటింగ్ అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేశామని తెలిపారు. అయినా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నరని మండిపడ్డారు. అధికారులకు కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా వారు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మెరుపు సమ్మెకు దిగినట్లు వెల్లడించారు. బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌లో కనీస వసతులు కూడా లేవని, ఎటువంటి నిర్మాణాలు చేయలేదని స్పష్టం చేశారు. అక్కడ మార్కెట్‌లో గంటకు 200 లారీలు సరుకు దిగుమతి చేసుకునే విధంగా గిడ్డంగుల నిర్మాణం చేపట్టాలని, వెయ్యి మంది కార్మికులు విశ్రాంతి తీసుకునేలా విశ్రాంతి భవనం దానికి అనుగుణంగా బాత్‌రూంలు, స్నానాల గదులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని హమాలీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్ కమిటీకి వినతి పత్రం అందజేత
బాటసింగారమైనా, కోహెడకైనా అన్ని వసతులు కల్పించాకే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించాలని కోరుతూ శనివారం సిఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చంద్రమోమన్, జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, సర్కిల్ కన్వీనర్ ఎం వీరయ్య, హమాలీ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ మక్సూద్, ఉపాధ్యక్షులు ఎండీ షరీఫ్, దేవేందర్, పోచయ్య, బుచ్చమ్మచ, పండరి తదితరులు మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్తిరెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి పద్మహర్షలను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు సీఐటీయూ హమాలీ యూనియన్ నాయకులు ప్రకటించారు.