రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కిలో మీటర్లు ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో బలపడుతుండటంతో ఈ నెల 15న భారీ వర్షాలు కురస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలలో కుండపోత వర్షాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కిలో మీటర్లు ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో బలపడుతుండటంతో ఈ నెల 15న భారీ వర్షాలు కురస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలలో కుండపోత వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, శుక్రవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో 3.4మిమీ వర్షాపాతం నమోదైంది.