రాత్రిపూట అసలు నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. అయితే ఈ 5 చిట్కాలు పాటిస్తే ఇట్టే ఆదమరచి నిద్ర పోతారు

నిద్ర పట్టకపోవడం కూడా ఇప్పుడున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. నిద్రలేమితో చాలా మంది సతమతమవుతున్నారు.

Update: 2024-05-20 09:47 GMT

దిశ, ఫీచర్స్: నిద్ర పట్టకపోవడం కూడా ఇప్పుడున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. నిద్రలేమితో చాలా మంది సతమతమవుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి చాలా రకాల మందులు వాడుతున్నారు. కొందరైతే ప్రత్యేకంగా చికిత్స కూడా చేయించుకుంటున్నారు. నిద్రపట్టక పోవడానికి కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కాకుండా మధుమేహం లాంటి ఇతర అనారోగ్య సమస్య కూడా కారణం కావచ్చు.. అయితే ఈ 5 చిట్కాలు పాటిస్తే ఖచ్ఛితంగా ఆదమరచి నిద్ర పోతారు.

పడుకునే ముందు:

నిద్ర సులభంగా పట్టాలంటే పడుకునే ముందు పుస్తకం చదవడం, స్నానం చేసుకోవడం, లేదా ధ్యానం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల కూడా నిద్ర త్వరగా వచ్చేస్తుంది.

నిద్రించే ప్రదేశం:

హాయిగా నిద్రపోవాలంటే నిద్రించే ప్లేస్ చాలా ముఖ్యం. బెడ్‌రూంలో ఎక్కువ శబ్దాలు లేకుండా ప్రశాంతంగా వుండేలా చూసుకోవాలి. కళ్లకు లైట్ ఎక్కువ పడకుండా బెడ్ ల్యాంప్‌ను తక్కువ లైట్‌తో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

కంప్యూటర్, ఫోన్ వాడకాన్ని తగ్గించాలి:

నిద్రించే సమయంలో కంప్యూటర్, ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించవద్దు. వాటి నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కళ్లు దారుణంగా దెబ్బతినే అవకాశం వుంది. పడుకునే కొన్ని నిమిశాల ముందు ఫోన్, లేదా కంప్యూటర్‌ను వాడవద్దు.

తినే ఆహారం:

మనము తినే ఆహారం కూడా నిద్ర పై ప్రభావం చూపుతుంది. కడుపుకు కావలసిన దానికంటే కూడా కొందరు ఎక్కువగా లాగించేస్తారు. ఇలా తినడం వల్ల కూడా కడుపు ఉబ్బరంగా, ఆయాసంగా అనిపించడం వల్ల నిద్ర పట్టదు. అలాగే నిద్రించే ముందు టీ, కాఫీ, మద్యం వంటివి తీసుకోవడం వల్ల కూడా నిద్రకు భంగం ఏర్పడుతుంది.

వ్యాయామాలు:

నిద్రపోయే ముందు బ్రీతింగ్ వ్యాయామాలు లాంటివి చేయడం వల్ల కూడా నిద్ర త్వరగా పట్టే అవకాశం వుంది.

తియ్యని పదార్థం:

ఒక గ్లాసు పాలల్లో తగినంత చెక్కరను వేసుకొని తాగడం వల్ల కూడా నిద్ర పడుతుంది. తియ్యటి పదార్ధాల్లో నిద్రను ప్రేరేపించే ఇంగ్రిడియంట్స్ ఉండటం వల్ల నిద్ర త్వరగా పడుతుంది.

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News