చింత గింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
మనలో చాలా మందికి ముఖాలపై నల్లటి మచ్చలు ఉంటాయి
దిశ, ఫీచర్స్: మనలో చాలా మందికి ముఖాలపై నల్లటి మచ్చలు ఉంటాయి. మరి ముఖ్యంగా యువత ఈ సమస్యతో బాధ పడుతుంటారు. ఫెయిర్ స్కిన్‌పై డార్క్ స్పాట్స్ మీ ముఖం అంద హీనంగా తయారవుతోంది. కొంతమందిలో నల్ల మచ్చల పరిమాణం పెరిగి ముఖం నల్లగా మారుతోంది. అయితే ఈ చర్మ సమస్యకు చర్మంలో దాగి ఉన్న మెలనిన్ కు ప్రత్యేక సంబంధం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మనిషి చర్మంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఈ మెలనిన్ స్థాయి పెరిగినప్పుడు జుట్టు, చర్మం నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని సందర్భాల్లో, శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ బలహీనమైనప్పుడు, మెలనోసైట్స్ తో పాటు థైరోసోనైస్ అనే ఎంజైమ్ మెలనిన్‌ను పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంది. అయితే, దీని ప్రభావం చర్మంపై పడి మచ్చలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఈ ఎంజైమ్‌ల ఉత్పత్తి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
చర్మంపై మంగు మచ్చలు ఇతర సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం చింత గింజలను ఖచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ చింత గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పై ఉన్న మంగు మచ్చల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రెగ్యులర్ వాడకంతో, మీ చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది.