మొబైల్ ఫోన్స్‌ను పిల్లలకు ఎందుకు దూరంగా ఉంచాలి?

దిశ, ఫీచర్స్: సెల్‌ఫోన్స్ నుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్స్ పిల్లలకే కాదు Latest Telugu News

Update: 2022-09-13 08:19 GMT

దిశ, ఫీచర్స్: సెల్‌ఫోన్స్ నుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్స్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ప్రమాదకరమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం ఏడాది రెండేళ్ల పిల్లలు కూడా గంటల తరబడి సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ఈ అడిక్షన్‌ను వదిలించడం తల్లిదండ్రులకు కూడా సాధ్యమవడం లేదు. ఇక ఇటీవలే బరేలిలో సెల్‌ఫోన్ పేలిన ఘటనలో 8 నెలల చిన్నారి మృతిచెందడం షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే పిల్లలను మొబైల్ ఫోన్స్‌కు ఎందుకు దూరంగా ఉంచాలో వివరిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.

రేడియేషన్ రిస్క్ :

సెల్ ఫోన్లు వంటి పరికరాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రాలకు(EMFలు) దీర్ఘకాలం బహిర్గతమవడం మానవులకు ప్రమాదకరం. శరీర నిర్మాణ సంబంధమైన, శారీరక వ్యత్యాసాల కారణంగా శిశువులకు ఇది మరింత హానికరం. అన్ని సెల్‌ఫోన్స్ 'రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్'గా పిలువబడే ఒక రకమైన EMF రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. కొన్నిసార్లు దీన్ని 'మైక్రోవేవ్ రేడియేషన్' అని కూడా సూచిస్తారు. పలుచని పుర్రెభాగం ఉండటం వల్ల ఈ రేడియేషన్లు శిశువులకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. అంతేకాదు శిశువుల మెదడు కణజాలం పెద్దల మెదడు కంటే రెట్టింపు రేడియేషన్‌ను గ్రహిస్తుందని 2008లో ఒక అధ్యయనం కనుగొంది.

ఫోన్ స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ :

కంటి ఆరోగ్యం, నిద్ర, ఉత్పాదకత, ప్రవర్తనకు సంబంధించి బ్లూ లైట్ ప్రభావాలపై అనేక పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా పిల్లల కంటి లెన్స్.. ఈ బ్లూ లైట్‌ను పెద్దల లెన్స్ వలె ప్రభావవంతంగా ఫిల్టర్ చేయదు. పాతికేళ్లలోపు పిల్లలు రెటీనా ద్వారా 45% ఎక్కువ విషపూరితమైన నీలి కాంతిని గ్రహిస్తారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పైగా పిల్లలు తరచూ డిజిటల్ పరికరాలను వారి ముఖాలకు అతి దగ్గరగా ఉంచుతారు. తద్వారా నాలుగు రెట్లు అధిక మొత్తంలో బ్లూ లైట్‌కు గురవుతారు.

పేలుడు ప్రమాదాలు :

మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నాణ్యతలేని బ్యాటరీలు, చార్జర్స్ లేదా షార్ట్ సర్క్యూట్స్ ఇందుకు కారణం కావచ్చు. అయితే, ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఫోన్లు పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలు తమ జేబులో మొబైల్ పెట్టుకున్నప్పుడు పేలిపోవడం కూడా అలాంటిదే. కాబట్టి ఈ తరహా అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు పిల్లలకు మొబైల్స్ ఇవ్వకపోవడమే కాక వారి చుట్టూ ఉన్నపుడు మనం కూడా మొబైల్స్‌ వాడకంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఈ టీచర్ రూటే వేరు.. 93 వయసులో ఎంతటి సాహసం చేసిందంటే? 


Similar News