ఉమెన్స్ డే రోజు పర్పుల్ కలర్‌నే ఎందుకు చిహ్నంగా వాడుతాారు?

మార్చి 8 న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

Update: 2024-03-07 10:03 GMT

దిశ, ఫీచర్స్: మార్చి 8 న  ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ‘రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మన దిశ, దశల గురించి చర్చించే ప్రత్యేకమైన రోజు’. మహిళలు తమ ఉనికితో ఈ ప్రపంచానికి తీసుకువచ్చే సారాన్ని గౌరవించటానికి మార్చి 8 న మహిళా దినోత్సవం స్థాపించబడింది. కొన్నేళ్ల పాటు అణచివేత తర్వాత ఈ రోజు మహిళల హక్కుల కోసం పోరాడటానికి, సమానత్వాన్ని స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ఊదా రంగుతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు పర్పుల్ రంగులో పోస్టర్‌లు, గూగుల్ డూడుల్‌లను చూసే ఉంటారు. మరీ పర్పుల్ రంగుకే ఎందుకు ఇంత ప్రాధాన్యమిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? ఊదా రంగు దేనిని సూచిస్తుంది? ఎందుకు దానినే ఉపయోగిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఊదా, వైట్, గ్రీన్ ముఖ్యమైన రంగులు. ఇవి 1908 లో యునైటెడ్ కింగ్ డమ్ లోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ నుంచి వాటి మూలాలను గర్తించాయి. ఊదా రంగు న్యాయం, గౌరవాన్ని సూచిస్తుంది. గ్రీన్ ఆశను, తెలుపు స్పచ్చతను సూచిస్తుంది.

ముఖ్యంగా పర్పుల్ రంగు మహిళల ఉద్యమం పట్ల విధేయతను సూచిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ లో అండ్ నేషనల్ ఉమెన్స్ పార్టీ ఊదా, గోల్డ్, వైట్ కలర్స్ కలయికను స్వీకరిస్తుంది. పర్పుల్ దృఢత్వాన్ని, విధేయతను సూచిస్తుంది. USA లో మహిళల ఓటు హక్కును సమర్ధించే ఉద్యమం కోసం పర్పుల్ రంగు కూడా ఉపయోగించబడింది. ఈ రంగు స్త్రీ శక్తులకు ప్రాతినిధ్యం వహించే రంగుగా చెబుతారు.


Similar News