పిల్లలు పిరికివాళ్లుగా ఎందుకు మారుతారు?.. పేరెంట్స్ బిహేవియర్ కూడా కారణమా?

చిన్న పిల్లలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు. కానీ కొందరిలో అలాంటి యాక్టివ్‌‌నెస్ ఉండకపోవచ్చు. పుట్టిపెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

Update: 2024-06-07 07:56 GMT

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు. కానీ కొందరిలో అలాంటి యాక్టివ్‌‌నెస్ ఉండకపోవచ్చు. పుట్టిపెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు పరికివాళ్లుగా మారడానికి వారి చుట్టూ ఉండే వాతావరణం లేదా తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

వాస్తవానికి చిన్న పిల్లల మనస్సు ఖాళీగా ఉన్న తెల్లకాగితం లాంటిది. ఈ కాగితంలో మనం ఎలాంటి గీతలు గీస్తే అలాంటి గీతలే లైఫ్ లాంగ్ లేదా కొంతకాలం వరకు ఉండిపోతాయట. అంటే ప్రవర్తన, వ్యక్తిత్వం విషయంలోనూ ఇది వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పిల్లల ముందు పెద్దలు లేదా తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తుంటారో, ఎలా వ్యవహరిస్తుంటారో దాదాపు పిల్లల్లోనూ అలాంటి ప్రవర్తన, వ్యక్తిత్వాలే కొంతకాలమైనా కనిపించే చాన్సెస్ ఎక్కువట. పిరికితనం వంటి వ్యక్తిత్వం డెవలప్ కావడంలోనూ ఇదే జరుగుతుంది.

తల్లిదండ్రుల్లో ఆందోళన..

సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ ఇంకా ఎదగని పిల్లల ముందు తరచుగా వాటిని ప్రస్తావించడం, ఆందోళన చెందడం వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భారత దేశంలో అయితే బాల్య దశలో పిల్లలకు తల్లిదండ్రులే సర్వస్వం. పేరెంట్స్ ఉన్నారనే ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఉంటారు. అలాంటప్పుడు పిల్లల ముందు తరచూ బాధపడటం, ఆందోళన చెందడం వంటి ప్రవర్తన వారిలో సంతోషాన్ని, ధైర్యాన్ని దూరం చేస్తుంది. ఒక భయానక మనసత్వం ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి పేరెంట్స్ బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు.

సంబంధాలు సరిగ్గా లేనప్పుడు

పేరెంట్స్‌కు పిల్లలకు మధ్య సంబంధాలు సరిగ్గా లేనికారణంగా పిల్లల్లో పరికితనం ఏర్పడటానికి దారితీస్తుంది. అలాగని అందరిలో అదే జరుగుతుందని చెప్పలేం. తల్లిదండ్రులకు దూరంగా ఉండే కొందరు పిల్లల్లో స్వతంత్ర భావాలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉండవచ్చు. మరి కొందరు పిల్లలు తరచుగా నిర్లక్ష్యం, తిరస్కరణ, గొడవలు వంటి పరిస్థితులు నడుమ పెరగడం కారణంగా పిరికి వాళ్లుగా మారవచ్చు.

చేదు అనుభవాల ప్రభావం

చిన్న ఏజ్‌లో తీవ్రంగా కలచి వేసే సంఘటనలు, సమస్యలు, కుటుంబ పరిస్థితులు వంటి చేదు అనుభవాలు కూడా పిల్లల్లో పిరికితనానికి దారితీస్తుంటాయి. గత విషయాలను తలుచుకుని ఎంతో భయపడిపోతుంటారు. చిన్నప్పుడు ఏదైనా చెడు ఘటనను ఎదుర్కొంటే అది జీవితాంతం కానీ, పిల్లల్లో మెచ్యూరిటీ వచ్చే వరకు కానీ గుర్తుండిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇష్టమైన వాళ్లను, తల్లిదండ్రులను కోల్పోవడం పిల్లల మనసులో భయాన్ని కలిగిస్తుంది.

తల్లిదండ్రుల ప్రవర్తన

ఈరోజుల్లో పేరెంట్స్ తమ పిల్లలకు ఏ కష్టాలూ రాకూడదనే ఉద్దేశంతో ప్రవర్తించడం చూస్తుంటాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వారే పరిష్కరిస్తుంటారు. పిల్లలకు రిస్క్ ఉండకూడదని భావిస్తుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లల్లో స్వతంత్ర భావాలు ఏర్పడటం లేదా ఒక సమస్య ఎదురైనప్పుడు పరిష్కరించుకోవడం వంటి ఆలోచనలు దీనివల్ల తగ్గిపోతాయి. ఇతరులపై ఆధారపడటం నేర్చుకుంటారు. తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే చిన్న చిన్న విషయాల్లోనూ పేరెంట్స్ కలుగజేసుకునే బిహేవియర్ వారిని పిరికి వాళ్లుగా తయారు చేస్తుంది. అందుకే పిల్లలు సవాళ్లను కూడా ఎదుర్కొనే అవకాశం ఇవ్వాలి. 


Similar News