భోజనం తర్వాత 100 అడుగులు.. అలవాటు వెనుకున్న ఆంతర్యం ఏంటి?
ఆరోగ్యంగా, చురుగ్గా, ఫిట్‌గా ఉండటానికి.. మనం తీసుకునే ఆహారం మీద ఎంత కాన్సెంట్రేట్ చేయాలో..
దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా, చురుగ్గా, ఫిట్‌గా ఉండటానికి.. మనం తీసుకునే ఆహారం మీద ఎంత కాన్సెంట్రేట్ చేయాలో.. భోజనం చేసిన తర్వాత చేయాల్సిన పనులపై కూడా అంతే దృష్టి పెట్టాలి. ఈ క్రమంలోనే ఆయుర్వేదంలో 'శతపావ్లి' అనే పురాతన భారతీయ భావన.. భోజనం తర్వాత 100 అడుగులు నడవడం మంచిదని నిర్వచించింది. పురాతన కాలం నుంచే ఉన్న ఈ అలవాటు.. జీర్ణక్రియకు అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు వివరించారు. ఇది శరీరానికి, మంచి జీర్ణక్రియ అలవాట్లను ఆహ్వానించి, ఫిట్‌గా ఉంచడానికి అత్యంత ప్రయోజనకరమైన మార్గంగా ఉంది.
'శతపావ్లి' ప్రయోజనాలు:
* జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
* క్యాలరీల బర్నింగ్‌ను ప్రోత్సహిస్తుంది.
* రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
* శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నిర్వహిస్తుంది.
* ఆహార పదార్థాలను బాగా స్థిరపడటానికి అనుమతిస్తుంది.
జర్నల్‌లో ప్రచురించిన స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయన పరిశోధకులు భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుందని గుర్తించారు. అలా కాకుండా భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు, కొవ్వు పెరుగుతుంది. తద్వారా జీవక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఆహారం తీసుకున్న వెంటనే నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది కాస్త ఊబకాయానికి దారి తీస్తుంది. తిన్న తర్వాత ఈత కొట్టడం, ఎక్కువ దూరం నడవడం, పాటలు పాడటం, ప్రయాణం చేయడం, వ్యాయామం చేయడం వంటి కార్యకలాపాలు వాత తీవ్రతను కలిగిస్తాయి. జీర్ణక్రియకు భంగం కలిగించి.. ఉబ్బరం, పోషకాహార అసంపూర్తి శోషణం, అసౌకర్య అనుభూతికి దారితీస్తాయి. అందుకే భోజనం తర్వాత 100 అడుగులు వేయాలని ప్రోత్సహించినప్పటికీ, చురుకైన నడక శరీరంలోని దోషాలను తీవ్రతరం చేస్తుందని గుర్తుంచుకోండి.
Read more: