ఎమోజీలు, స్మైలీలు ఎల్లో కలర్‌లోనే ఎందుకుంటాయి?.. అసలు రహస్యం ఇదే!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్ వాడుతున్నారు. సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు.

Update: 2024-06-06 06:23 GMT

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్ వాడుతున్నారు. సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఛాటింగ్ చేయనిదే పొద్దు గడవని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కాగా ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెసేజ్‌లతో అత్యధికమంది ఛాటింగ్ సందర్భంలో ఎమోజీలు, స్మైలీలు యూజ్ చేస్తుంటారు. అయితే ఈ ఇవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజం చెప్పాలంటే భావాల వ్యక్తీకరణను వేగంగా, సింపుల్‌గా షాట్ కట్‌లో తెలియజేయడంలో ఎమోజీలు, స్మైలీలు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఎక్కువమంది యూజ్ చేస్తున్నారు. వాట్సాప్‌లో సుమారు ఎనిమిది వందల వరకు ఎమోజీలు ఉంటున్నాయి. ఇవి డిఫరెంట్ ఎమోషన్స్‌ను, ఫీలింగ్స్‌ను తెలియజేస్తాయి. కాగా ఇవన్నీ ఎల్లో కలర్‌లోనే ఎందుకు ఉంటాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  అయితే ఇంటర్నెట్‌లో అన్నింటికీ సమాధానం లభించే నాలెడ్జ్ హబ్‌  అయినటువంటి Quora నిపుణులు చెప్తున్న సమాధానం ఏంటంటే.. పసుపు రంగు ఆనందాన్ని సూచిస్తుంది. అందుకే స్మైలీలకు, ఎమోజీలకు యూజ్ చేస్తారు. దీంతోపాటు కళ్లు క్లియర్‌గా చూడగలిగే కలర్ ఎల్లోనే కావడం మరో ప్రత్యేకత. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక మంది స్కిన్ టోన్‌కు పసుపు రంగు మ్యాచ్ అవుతుందట. పైగా ఈ కలర్‌లో అయితే నవ్వుమొహం, కళ్లు, ముఖంలోని భావాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎమోజీలు, స్మైలీలకు ఎల్లో కలర్ డిసైడ్ చేశారు నిపుణులు.  


Similar News