ఈ పక్షుల్లో.. ఏ ఒక్కటి మీ ఇంట్లోకి వచ్చిన లక్ష్మీ దేవి వచ్చినట్టే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కొన్ని పక్షులు రావడం వలన శుభం, అశుభం జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కొన్ని పక్షులు రావడం వలన శుభం, అశుభం జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అందులో ఈ పక్షులు మీ ఇంటికి పదే పదే వస్తుంటే మీరు త్వరలోనే రాజ భోగాన్ని అనుభవించబోతున్నారని అర్ధం. మరి ఆ పక్షులు ఏంటో అవి రావడం వలన మీకు కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం..
పూర్వం మన పూర్వీకులు ఎక్కువ శాతం వరకు పక్షులను పెంచే వారు. వాటి కోసం గింజలను, నీళ్లను పెట్టే వారు. ఇంట్లోకి పిచ్చుకలు ప్రవేశించడం వలన మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఎందుకంటే పూర్వం నుంచే పిచ్చుకలు ఇంట్లోకి రావడాన్ని శుభ సూచికంగా భావించారు. మీ ఇంట్లోకి జంట పిచ్చుకలు వస్తే కళ్యాణం మీ ఇంట్లో జరగబోతుందని అర్ధం లేదా సంతానం కలగబోతుందని అర్ధం. కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చిన , గూడు కట్టుకున్నా అది మీకు చాలా వరకు శుభమే.
మనం కాకిని తరచూ చూస్తూనే ఉంటాము. కాకిలో మన పితృ దేవతలు ఉంటారని మన పెద్దలు అంటుంటారు. అయితే మీ ఇంటికి వస్తే మీ పితృ దేవతలు వచ్చినట్లుగా భావించి వాటికి ఆహారాన్ని వేయాలి. కాకికి ఆహారాన్ని పెట్టడం ద్వారా శని బాధలు కూడా తొలగిపోతాయి. కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాలితే చాలా మంచిదని వాస్తు నిపుణులు తెలిపారు.
Read More: ఆడపిల్లలకు ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదు.. ఎందుకంటే?