దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పచ్చళ్ళను కూరగాయలు, ఆకు కూరలతో చేస్తారు. చీమలతో పచ్చడి ఎక్కడైనా విన్నారా? గిరిజన ప్రాంతాల్లో చీమల చట్నీకి చాలా డిమాండ్ ఉంది. ఆది వాసీ సాంప్రదాయ వంటకమైన చీమల చట్నీని ఒరిస్సా లోని మారు మూల ప్రాంతంలో గిరిజన గ్రామంలో పూర్తిగా పాత పద్ధతిలో తయారు చేసుకొని తింటున్నారు. ప్రపంచంలో ఆహార అలవాట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. భారత్ లోని ఆది వాసులు నేటికి ఎర్ర చీమలను చట్నీ చేసుకొని తింటున్నారు. ఒరిస్సా లోని గజపతి జిల్లాలోని ప్రజలు చెట్ల పై నుంచి చీమలను సేకరించి పచ్చడి చేసుకుంటున్నారు. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
Read More: కూతురు పిండప్రదానం చేయవచ్చా..? ఆ సమయంలో తెల్ల చీరనే కట్టుకోవాలా..?