Weight gain Foods : బాడీ షేపునే మార్చేసే పలు ఆహారాలు.. సన్నగా ఉన్నావారు కూడా బొద్దుగా..

Weight gain Foods : బాడీ షేపునే మార్చేసే పలు ఆహారాలు.. సన్నగా ఉన్నావారు కూడా బొద్దుగా..

Update: 2024-10-04 09:42 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే తగిన ఆహారం తీసుకోవాల్సిందే. పరోక్షంగా అందాన్ని పెంచడంలోనూ ఇందులోని పోషకాలు, విటమిన్లు ఉపయోగపడతాయి. అలాగే అనారోగ్య కరమైన ఫుడ్స్ తీసుకునే అలవాటు సన్నగా, ముద్దుగా ఉండే మీ బాడీ షేపును.. గరుకుగా, బొద్దుగా మార్చే అవకాశం ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్, హై షుగరింగ్ డ్రింక్స్ అధిక బరువును పెంచడం ద్వారా మీ శరీరాకృతిలో మార్పులకు దారితీస్తాయి. కాబట్టి వెయిట్ తగ్గాలంటే ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

* ఫాస్ట్‌ ఫుడ్ : ఫాస్ట్‌ఫుడ్ టేస్టీగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడుతుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ.. ఎక్కువగా అదే తింటుంటే మాత్రం అధిక బరువు పెరుగుతారని నిపుణులు చెప్తున్నారు. అలాగే చిప్స్, కుకీలు, స్వీటెనర్లు, ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు వంటి జంక్‌ఫుడ్స్ తినడం మీ బాడీ షేపును మార్చేయగలవని నిపుణులు అంటున్నారు. 2011 నాటి ఒక అధ్యయనం ప్రకారం.. పొటాటో చిప్స్ తరచుగా తినడం అధిక బరువుకు దారితీస్తుంది.

* షుగరింగ్ డ్రింక్స్ : అధిక చక్కెరలు కలిగిన కూల్ డ్రింక్స్, సోడా వంటివి తరచుగా తాగినా అధిక బరువు సమస్యకు దారితీస్తాయని 2022 నాటి పరిశోధనల్లో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి ఆకలి తీర్చకపోగా కేలరీలను పెంచుతాయని, జీవక్రియలో ప్రతికూల మార్పులను ప్రేరేపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దూరంగా ఉండటం మంచిది.

* ఫ్రెంచ్ ఫ్రైస్ : ప్రస్తుతం చాలా మంది ఫ్రెంచ్‌ ఫ్రైస్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫ్రైడ్ చికెన్, నూడుల్స్, మంచూరియా, కట్లెట్ వంటి ఆహారాల్లో అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కాలక్రమేణా అధిక బరువుకు, శరీరాకృతిలో మార్పునకు దారితీస్తాయి.

* బ్రెడ్ అండ్ పాస్తా : నిజానికి ఇవి రెండు కూడా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలే. ఒక అధ్యయనం ప్రకారం రోజుకూ రెండు బ్రెడ్ స్లైస్.. అంటే దాదానె 120 గ్రాముల వరకు తినడం కంటిన్యూ చేస్తే.. మీరు ఎంత సన్నగా ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత లావెక్కే అవకాశం ఉంటుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా సాధారణ వ్యక్తులు కూడా 40 శాతం అధిక బరువు పెరిగే చాన్స్ ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు పేర్కొంటున్నారు.

* అధిక కొవ్వులు : హై‌ఫ్యాట్స్ కలిగి ఉండే ఆహారాలు కూడా శరీరంలో మార్పులకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా నూనెలో అధికంగా వేయించిన మాంసాన్ని తినడం రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ కేలరీలతో పాటు శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి వెయిట్ తగ్గించే ప్రక్రియను అడ్డుకోవడంతో పాటు అధిక బరువును ప్రేరేపిస్తాయి. తరచుగా తింటే శరీరాకృతిని మార్చేస్తాయని, సన్నగా ఉన్నవారు కూడా బొద్దుగా మారుతారని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి పైన పేర్కొన్న ఐదు ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు. 

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News