చీరలో సన్నగా, అందంగా కనిపించాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి

అమ్మాయిలు చీరలో చాలా అందంగా ఉంటారు. అయితే కొంత మంది చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉన్నా,సారీ కడితే కాస్త బొద్దుగా కనిపిస్తారు. అయితే అమ్మాయిలు చీరలో చాలా నాజుగ్గా, అందంగా కనిపించాలంటే,

Update: 2024-03-20 09:06 GMT

దిశ,ఫీచర్స్ : అమ్మాయిలు చీరలో చాలా అందంగా ఉంటారు. అయితే కొంత మంది చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉన్నా,సారీ కడితే కాస్త బొద్దుగా కనిపిస్తారు. అయితే అమ్మాయిలు చీరలో చాలా నాజుగ్గా, అందంగా కనిపించాలంటే, ఈ టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • చీరలు ఎంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పలుచటి చీరల్లో అమ్మాయిలు కాస్త సన్నగా కనిపిస్తారు. అమ్మాయిలు అందంగా కనిపించాలంటే, మంచి డిజైన్‌తో ఉన్న సారీస్ కట్టుకుంటే బాడీ షేప్ సరిగ్గా ఉంటుదంట.

  • పొట్టిగా ఉన్న వారు చీర కడితే ఇంకాస్త పొట్టిగా కనిపిస్తారు. అందువలన అలవాంటి వారు హీల్స్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

  • మల్టీకలర్ చీరలపై చిన్న చిన్న బొమ్మలు ఉండే డిజైన్స్ చీరల్ని ఎంచుకోండి. ఈ మధ్య ఎక్కువ మంది చీరలకి కాంట్రాస్టింగ్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు. అయితే సన్నగా కనిపించాలంటే కాంట్రాస్టింగ్ కాకుండా మోనోక్రోమటిక్ కలర్స్ చీర, బ్లౌజ్ వేసుకుంటే మరింత అందంగా, నాజుగ్గా కనిపిస్తారు.

  • ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు, పట్టు చీరలు, చాలా లావుగా ఉన్న చీరలను ఎంచుకోకూడదు.దీని వలన బొద్దుగా కనిపించే అవకాశం ఉంటుంది. పెద్ద అంచు ఉన్న సన్నపు చీరలు ఎంచుకోవాలి.

  • చీరను కట్టుకునేటప్పుడు మంచిగా పిన్స్‌తో సర్దినట్టు కట్టుకోవాలి. దీని వలన సన్నగా కనిపిస్తారు.

Similar News