ఫుడ్ కోసం పిల్లిని మాయ చేసిన స్మార్ట్ కాకులు! ఆనంద్ మహీంద్ర ట్వీట్
చిన్నపిల్లలకు చెప్పే కాకి కథలు మనకు తెలుసు. Crows Teaming Up To Outsmart Cat.
దిశ, వెబ్‌డెస్క్ః భూమిపై ఉన్న జీవిజాతులన్నీ బతికే క్రమంలో ఎన్నో ఉపాయాలు నేర్చుకుంటాయి. అలాంటి వాటిలో కాకి మాత్రం కాస్త ప్రత్యేకంగానే నిలుస్తుంది. చిన్నపిల్లలకు చెప్పే కాకి కథలు మనకు తెలుసు. దాహమేసిన కాకి నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసే కథలో కాకి తెలివి అద్భుతంగా కినిపిస్తుంది. నిజానికి, మనుషులకు దగ్గరగా నివశించే ఈ కాకులు చాలా తెలివిగలవని చెప్పే కాకుల వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ట్విటర్‌లో ఈ చమత్కారమైన వీడియోను షేర్ చేశారు. ఆహారం కోసం రెండు కాకులు ఓ పిల్లిని మాయ చేసే వీడియో ఇది.
ఈ వైరల్ క్లిప్‌లో, ఏదో తింటున్న ఓ పిల్లి దగ్గర ఆహారాన్ని దొంగిలించడానికి చూసిన కాకులు రెండు వచ్చి అక్కడ వాలతాయి. అందులో ఒకటి వెనుక నుండి పిల్లిని ముక్కుతో పొడవగా పిల్లి వెనకు తిరిగి ఆ కాకిని వెంబడిస్తుంది. ఇంతలో పక్కగా వెళ్లి నిలుచున్న మరో కాకి అప్పలిదాకా పిల్లి తింటున్న ఆహారాన్ని ఛటుక్కున నోటకరచి, తుర్రున ఎగురుతుంది. ఇక, ఈ వీడియోను చూసిన నెటిజన్లు కాకి తెలివికి అవాక్కయ్యారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ప్రస్తావిస్తూ టీమ్ వర్క్ తో మరింత సులువుగా పనిచేయొచ్చని పేర్కొన్నారు.