Viral : లగ్గమైతలేదని బర్రెను పెండ్లి చేసుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే..

ఒకప్పుడు పెండ్లి చేసుకోవడం యువతకు చాలా ఈజీగా ఉండేది. పెద్దలే అమ్మాయి/అబ్బాయిని వెతికి వివాహం జరిపించేవారు. పెద్దలు చూసిన సంబంధాన్ని దాదాపు ఎవరూ కాదనేవారు కాదు.

Update: 2024-06-05 09:22 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు పెండ్లి చేసుకోవడం యువతకు చాలా ఈజీగా ఉండేది. పెద్దలే అమ్మాయి/అబ్బాయిని వెతికి వివాహం జరిపించేవారు. పెద్దలు చూసిన సంబంధాన్ని దాదాపు ఎవరూ కాదనేవారు కాదు. కానీ ఇటీవల సీన్ మారిపోయింది. యువత ఆలోచనలు, అంచనాలు, ఊహలు మరో లెవల్లో ఉంటున్నాయి. దీంతో ఓ పట్టాన పెళ్లిళ్లు కుదరడం లేదు.

ముఖ్యంగా గత కొంతకాలంగా అమ్మాయిలు దొరకడం లేదనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. దీంతో రోజు రోజుకూ అమ్మాయిలకు డిమాండ్ పెరిగిపోతోందనే కోణంలో పలువురు ఫన్నీ వీడియోలు, ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ప్రజెంట్ అలాంటి న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ యువకుడు తనకు ఎంత వెతికినా పిల్ల దొరక్క పెండ్లి కావడం లేదని, ఏకంగా ఓ బర్రెను లగ్గం చేసుకున్నాడు. ఆ బర్రె మెడలో పూలమాల వేసి, తర్వాత అతను కూడా వేసుకున్నాడు.

బర్రెను లగ్గం చేసుకున్న యువకుడు దాని నుదుటిపై బొట్టు పెట్టి, చున్నీతో అలంకరించాడు. అనంతరం ఓ మహిళ బర్రెకు, ఆ యువకుడికి దిష్టి తీసింది. చివరికి సదరు యువకుడు బర్రెపై ఎక్కి వెళ్లాలని ట్రై చేయగా, కొంత దూరం అతన్ని మంచిగనే మోసుకెళ్లిన ఆ బర్రె ఒక్కసారిగా కిందపడేసి లగెత్తుతుంది. ఇది చూసిన నెటిజన్లంతా ‘పెండ్లి పెటాకులైంది కదా.. ఎక్స్‌ట్రాలు చేస్తే గట్లనే ఉంటది’ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 


Similar News