Viral : పారిస్‌ వెళ్లి పబ్లిగ్గా లవ్ ప్రపోజ్ చేసిన ప్రియుడు.. ఊహించని పరిణామంతో అంతా షాక్!

ప్రేమ గుడ్డిదో, మంచిదో, మేలు చేస్తుండో, కీడు చేస్తుందో.. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కానీ దేనికైనా వాస్తవమే కొలమానంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2024-07-10 06:10 GMT

దిశ, ఫీచర్స్ : ప్రేమ గుడ్డిదో, మంచిదో, మేలు చేస్తుండో, కీడు చేస్తుందో.. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కానీ దేనికైనా వాస్తవమే కొలమానంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. లవ్ విషయంలోనూ అంతే.. మనసులో ఊహించుకున్నవన్నీ జరగకపోవచ్చు. అందుకే ఆచరణలో కనిపించింది. అనుభవంలో ఎదురైంది మాత్రమే ప్రాతిపదికగా భావిస్తూ అడుగు ముందుకు వేయాలని, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకోవాలని చెప్తుంటారు. అలాంటి మెసేజ్ ఇచ్చే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ యువతిని ప్రేమించిన యువకుడు ఆమెను ఫాలో అవుతూ పబ్లిగ్గా ప్రపోజ్ చేస్తాడు. కానీ ఊహించిన రియాక్షన్‌తో షాక్ అవుతాడు. అసలేం జరిగిందంటే..

తాజాగా ఒక అమ్మాయి హాలిడే ఎంజాయ్‌మెంట్ కోసం పారిస్‌లోని మోంట్మార్‌ట్రే అనే అందమైన పర్వత ప్రాంతానికి వెళ్లింది. అయితే కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్న యువకుడు కూడా సదరు యువతిని ఫాలో అయ్యాడు. పారిస్ ట్రిప్‌లో ఓ మంచి సందర్భం చూసి వెరైటీగా ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. అందుకోసం ముందుగానే ఓ రెడ్ సూట్ ధరించి, అమ్మాయికోసం ఓ రింగ్ కూడా తీసుకున్నాడు. ఆ యువతి అనుసరించిన యువకుడు ఆమె తన స్నేహితులతో కలిసి ఓ బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఎంజాయ్ చేస్తుండగా.. మోకాళ్లపై కూర్చొని, రింగ్ ఇస్తూ పబ్లిగ్గా ప్రపోజ్ చేశాడు. అక్కడున్న జనం కూడా ఇదంతా గమనిస్తూ.. సదరు యువతి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఊహించని పరిణామంతో ఆ అమ్మాయి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి.. వెంటనే తేరుకొని అక్కడి నుంచి ఆందోళనగా వెళ్లిపోయింది.

లవ్ ప్రపోజ్ సందర్భంగా సదరు యువతి రియాక్షన్ చూసిన ఆ ప్రేమికుడు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. బాధతో కంటతడి పెట్టాడు. కాగా అక్కడున్న జనం అతన్ని ఓదార్చారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘‘ప్రేమంటే ఆషా మాషీ కాదు. ఎదుటి వారికి కూడా అభిప్రాయాలు ఉంటాయి. ముక్కూ మొహం తెలియని వారిని, అంతకు ముందు పరిచయం కూడా లేనివారిని ఎవరైనా ఎలా ప్రేమిస్తారు?’ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ‘‘ఇద్దరికీ ఇష్టమైతేనే అది ప్రేమ అవుతుంది తప్ప.. ప్రేమ పేరుతో అవతలి వ్యక్తి ఇష్టానికి భిన్నంగా ప్రవర్తిస్తే అది లవ్ ఎలా అవుతుంది?’’ అంటూ స్పందిస్తున్నారు. 


Similar News