Viral Video : స్కూటీ స్టార్ట్ చేస్తుండగా వింత శబ్దాలు.. ఏంటా అని డిక్కీ తెరిచి చూడగా..
అసలే వర్షాకాలం.. చిన్నగా ముసురు స్టార్టయింది. వెదర్‌ను బట్టి చూస్తే మరికాసేపట్లో వర్షం ఇంకా ఎక్కువయ్యే చాన్స్ కనిపిస్తోంది.
దిశ, ఫీచర్స్ : అసలే వర్షాకాలం.. చిన్నగా ముసురు స్టార్టయింది. వెదర్‌ను బట్టి చూస్తే మరికాసేపట్లో వర్షం ఇంకా ఎక్కువయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇది గమనించన ఓ మహిళ వెంటనే ఆఫీసుకు బయలు దేరుదామనుకొని తన స్కూటీ వద్దకు వెళ్లింది. స్టార్ట్ చేద్దామని చూసే సరికి డిక్కీలో నుంచి ఏదో వింత శబ్దం ఆమె చెవిన పడింది. కొంపదీసీ స్కూటీ ముట్టగానే స్టార్ట్ అయిందా ఏంటి? అని అనుమానం వచ్చి అబ్జర్వ్ చేయగా అలాంటిదేం జరగలేదు.
మరి ఏంటా శబ్దం!.. ఒక్కసారిగా భయం వేసింది సదరు మహిళకు. మెల్లిగా మరోసారి స్కూటీ మొత్తం పరిశీలించింది. అయినా ఏం కనిపించలేదు. వింత శబ్దం కూడా ఆగలేదు. పైగా ఆ సౌండ్ స్కూటీ మధ్య భాగంలోంచి వస్తోంది. గుండె గుభేల్ మంది. దీంతో పెద్దగా కేకలు వేసింది. ఇది విని ఆ మహిళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఏం జరిగిందో తెలుసుకొని, సదరు మహిళ తల్లి ఓ కర్ర తీసుకొని స్కూటీ డిక్కీని విప్పింది. ఇంకేముందు అప్పటి నుంచి వింత శబ్దాలు చేస్తూ.. పరేషాన్ చేసిందెవరో తెలిసిపోయింది. ఎంచక్కా డిక్కీలో పెట్రోల్ కొట్టే మూత చుట్టూ కొండ చిలువ(పైథాన్) చుట్టుకొని పడుకొని ఉంది.
ఎట్టకేలకు సదరు మహిళా ఉద్యోగిని తల్లి, ఆ పామును కర్రతో బెదిరించగా బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వీడియోలో సదరు వ్యక్తులు మలయాళం మాట్లాడటాన్ని బట్టి చూస్తే కేరళ రాష్ట్రంలో జరిగినట్లు అర్థం అవుతోంది. సాలిహ్త్ ముల్లాంబత్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. యూజర్లు క్యూరియాసిటీతో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘‘ట్యాంక్‌లో పెట్రోల్ ఉందో లేదో చెక్ చేద్దామని వచ్చినట్లుంది’’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా, ఇది ఇండియన్ పైథాన్ అంత విష పూరితం కాదని మరో వ్యక్తి స్పందించాడు.