Viral : అబ్బాయిలు నాతో రొమాన్స్ చేయట్లేదు.. అందంగా ఉన్నందుకే అలా..

అమ్మాయిలు అందంగా కనిపిస్తే చాలు అబ్బాయిలు వారికోసం క్యూ కడతారని అందరూ అంటుంటారు. కానీ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది.

Update: 2024-06-06 07:09 GMT

దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు అందంగా కనిపిస్తే చాలు అబ్బాయిలు వారికోసం క్యూ కడతారని అందరూ అంటుంటారు. కానీ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. తాను అందంగా ఉన్నందుకు అబ్బాయిలెవరూ తనవైపు చూడట్లేదని, రొమాన్స్ చేయడానికి ఇష్ట పడట్లేదని, దీంతో తాను సింగిల్‌గానే గడపాల్సి వస్తోందని తెగ బాధపడుతోంది.

సహజంగానే ప్రేమ, ఇష్టం వంటి విషయాల్లో ఆయా వ్యక్తుల పర్సనల్ ఇంట్రెస్ట్ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా మంది అందానికే ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ టెక్సాస్‌కు చెందిన ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఫ్యాషన్ స్టైలిష్ట్, టిక్‌టాక్ ఆర్టిస్ట్ అయినటువంటి అశ్లే(Ashley) మాత్రం తన అందమే తనకు సమస్యగా మారిందని బాధపడుతోంది. ఎందుకంటే తనను చూసిన ప్రతీ అబ్బాయి ‘ఇంత అందంగా ఉంది కాబట్టి ఈమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు’ అనే ఉద్దేశంతో ఆమెవైపు చూడటానికి ఇష్టపడట్లేదట.

అబ్బాయిలెవరూ తనకు లవ్ ప్రపోజ్ చేయడం లేదని అశ్లే ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, స్వయంగా తనే వెళ్లి అడిగినప్పటికీ, అందంగా ఉంది కాబట్టి ఆల్రెడీ చాలామందితో డేటింగ్ చేసి ఉండవచ్చనే ఉద్దేశంతో ఏ అబ్బాయి కూడా తనతో రొమాన్స్ చేయడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నది. ఈ విషయాలన్నీ ఆమె తన టిక్‌టాక్ వేదికగా పంచుకున్నట్లు ఇతర సోషల్ మీడియా వేదికల్లో వార్తలు వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అందంగా ఉంటే ఎవరు వదులుతారు.. నీలో ఏదో ఉంది’ అంటూ మరికొందరు సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు.


Similar News