పామాయిల్ వాడే గృహిణులకు షాకింగ్ న్యూస్.. తాజా అధ్యయనంలో తేలిందిదే!!
పామాయిల్ ఒక రకమైన నూనె. దీన్ని వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.
దిశ, ఫీచర్స్: పామాయిల్ ఒక రకమైన నూనె. దీన్ని వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉంది. రాజమండ్రి నుంచి ఏలూరు రైలులో వెళ్తున్న దారిలో ఈ తోటలు మనకు కనువిందు చేస్తాయి. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో నాణ్యమైన పంట దిగుబడి పొందే పంట ఆయిల్ పామ్. ఈ పంటకు మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
ఇతర వంట నూనెలతో పోల్చి చూసినట్లైతే పామాయిల్ ధర చాలా తక్కువ ఉంటుంది. లీటర్ పామాయిల్ ధర రూ.100 కంటే తక్కువగాఉంటుంది. తక్కువ ఖర్చని ఎక్కువమంది తరచూ పామాయిల్ ను వంటల్లో వాడుతుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువగా పామాయిల్‌నే ఉపయోగిస్తారు. కానీ పామాయిల్ అధికంగా యూజ్ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని తాజాగా నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి రోజూ పామాయిల్ వాడటం వల్ల ఫ్యాటీ లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయి. దీనిలో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో ఊబకాయం, కార్డియో వాస్క్యూలర్ డిసీజ్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి. పామాయిల్ 50 శాతం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ను కంప్రెస్ చేస్తుంది. కాగా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు, అథెరోస్కిరోసిస్ రిస్క్ ను పామాయిల్ పెంచుతుంది.
ఈ నూనెను ఎక్కువగా వంటల్లో వాడటం వల్ల ఆకలి పెరగడంతో పాటు కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మార్కెట్‌లో దొరికే చిప్స్ తయారీలో కూడా పామాయిల్ నే వాడుతారు. ఈ ఆయిల్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఈజీగా లావవుతారు. చాక్లెట్స్ తయారీలో కూడా పామాయిల్ ను అధికంగా ఉపయోగిస్తారు. కాగా పామాయిల్ తక్కువగా వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదంటే కొత్త అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.