ట్రెడ్‌మిల్ vs జాగింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిది ?
నేటి కాలంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పనిగా మారింది.
దిశ, వెబ్‌డెస్క్ : నేటి కాలంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పనిగా మారింది. ఆధునిక జీవనశైలి, స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం, అనారోగ్యకరమైన ఆహారం, ఈ రోజుల్లో నూనె, కారం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు. కానీ దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఊబకాయాన్ని తగ్గించుకోవడం శారీరక సౌందర్యాన్ని కాపాడుకోవడమే కాదు, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే స్థూలకాయం మధుమేహం, హై బీపీ వంటి అనేక తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది.
ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి డైట్, వ్యాయామం చేస్తున్నారు, అలాగే జిమ్‌కి వెళుతున్నారు. అంతే కాకుండా అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. చాలా మంది అడపాదడపా ఉపవాసం వంటి వాటిని కూడా అనుసరిస్తారు. అలాగే ఆహారం తీసుకోవడం నియంత్రించడం, నడక, పరుగు, యోగా లేదా జిమ్‌కి వెళ్లడం ఇలా ప్రతిరోజు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం. అయితే బరువుతను తగ్గించుకోవడానికి సాధారణంగా జాగింగ్ చేయడం మంచిదా, లేదా ట్రెడ్‌మిల్ పై నడవడం మంచిదా అనే విషయాలను మనం తెలుసుకుందాం.
బయట జాగింగ్..
బరువు తగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా నడుస్తుంటారు. ఏ రకమైన శారీరక శ్రమ అయినా ఏ వయస్సు వ్యక్తి అయినా చేయవచ్చు. ప్రత్యేక పరికరాలు లేదా జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. నడక ద్వారా బరువు తగ్గడమే కాకుండా, శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. జీవక్రియ పెరుగుతుంది. కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
నడవడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే నడక అనేది బరువు తగ్గడానికి మంచి ఎంపికగా చెబుతారు. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలిలో నడవడం వలన మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతిలో నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
బరువు తగ్గాలంటే ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు నడవాలి. మీకు ప్రతిరోజూ సమయం లభించకపోతే, వారానికి కనీసం 5 రోజులు నడవండి. బరువు తగ్గడానికి, నెమ్మదిగా నడవడం కంటే వేగంగా నడవడం చాలా మంచిది. దీన్నే బ్రిస్క్ వాక్ అని కూడా అంటారు.
ట్రెడ్‌మిల్ పై నడవడం..
బరువు తగ్గడానికి ట్రెడ్‌మిల్ పై నడవడం కూడా మంచి ఎంపిక. ఆధునిక జీవనశైలిలో భాగంగా చాలా మంది జిమ్‌లకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఇక్కడ ట్రెడ్‌మిల్‌లను ఉపయోగిస్తారు. చాలా మంది ఇంట్లో కూడా ట్రెడ్‌మిల్ చేస్తారు. ట్రెడ్‌మిల్ పై నడవడం వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి, ఇది బరువును తగ్గిస్తుంది. ట్రెడ్‌మిల్ పై రెగ్యులర్‌గా నడవడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీతో పాటు మోకాళ్లు, చీలమండల కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ట్రెడ్‌మిల్ పై నడిచే ముందు 5-10 నిమిషాల వార్మప్ చేయడం వల్ల కండరాలు వేడెక్కుతాయి. వ్యాయామం ముగించే ముందు నెమ్మదిగా నడిచి కూల్-డౌన్ అవ్వాలి.
నిపుణులు ఏమంటారు?
ఫిట్‌నెస్ నిపుణులు మాట్లాడుతూ బరువు తగ్గడానికి నడక మంచిదంటున్నారు. ఎందుకంటే ట్రెడ్‌మిల్ పై ఎక్కువసేపు వేగంగా పరిగెత్తితే, మోకాళ్ల మధ్య ఉన్న ద్రవం అరిగిపోతుంది. ఎందుకంటే ట్రెడ్‌మిల్‌పై ఒకే చోట ఎక్కువ సేపు నడుస్తారు కాబట్టి. కానీ మనం మామూలుగా నడిచేటప్పుడు మన కాళ్లలో చాలా కదలికలు ఉంటాయి. నిపుణుల సలహా లేకుండా ట్రెడ్‌మిల్ జాగింగ్ చేయకూడదు.
ప్రకృతిలో నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మీరు హాయిగా జాగింగ్ చేయవచ్చు. అందుకే ఇంటి వెలుపల జాగింగ్ చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ట్రెడ్‌మిల్ పై ఎక్కువసేపు నడవడం, ముఖ్యంగా వేగంగా నడవడం హానికరం. ట్రెడ్‌మిల్ పై నడుస్తున్నప్పుడు, మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ప్రారంభించాలి. వాస్తవానికి, రెండు పద్ధతులు వాటి వాటి స్థానాల్లో సరైనవి. కానీ మీ ఆరోగ్యం, అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, బరువు తగ్గడానికి ట్రెడ్‌మిల్ పై నడవడం లేదా బయట నడవడం మంచిదా అనే దానిపై మీ నిపుణులు మీకు సరైన సలహా ఇస్తారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.