మీరు పదే పదే ఓడిపోతున్నారా? నో ప్రాబ్లమ్..!

కొంతమంది పట్టుకున్నదల్లా బంగారం అయితే.. మరికొంతమంది ఎంత కష్టపడినా ఫలితం దక్కదు.

Update: 2024-01-08 11:40 GMT

దిశ, ఫీచర్స్: కొంతమంది పట్టుకున్నదల్లా బంగారం అయితే.. మరికొంతమంది ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. స్టడీ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగుల గురించి చూసుకున్నట్లైతే.. ఎంత కష్టపడి చదివిన ఉద్యోగాలు రావట్లేదని కొంతమంది డిప్రెషన్‌కు లోనై సూసైడ్ చేసుకుని, మరణించిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే ఒక వ్యక్తి పదే పదే వైఫల్యాలను చవి చూసినట్లైతే ఏం చేయాలి? ఆ పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి? ఫెయిల్యూర్‌కు కారణం ఏంటి? అని తాజాగా చాణక్యుడు చెప్పుకొచ్చారు. కాగా చాణక్యుడు చెప్పిన ఈ నియమాలు పాటించడం ద్వారా శత్రువులు కూడా ఆశ్చర్యపోయేలా ఎదుగుతారని చాణక్య నీతి చెబుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

మన ఆలోచనే మన విజయానికి దారితీస్తుంది. కాగా ఒక వ్యక్తి ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనలను అమలు చేయడు. దీంతో ఓటమి ఎదురవుతుంది. గెలుపు సాధించాలంటే తరచూ ఆలోచించడమే కాకుండా ఆ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలంటున్నాడు చాణక్యుడు. లేకపోతే పదే పదే ఫెల్యూర్‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్నట్లైతే.. ఉద్యోగం ఎలా వస్తుంది? ఎంత కాంపిటీషన్ ఉంది? మనం ఎలా చదవాలి? రోజుకు ఎన్ని గంటలు చదవాలి? మనం చదివే ఒక్కో సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి? అనే దానిపై ముందు ద‌ష్టి పెట్టాలంటున్నాడు చాణక్యుడు.

అలాగే మీ లక్ష్యాన్ని సాధించే మార్గంలో వచ్చే ఎంతటి కఠిన సమస్యలైనా ఎదుర్కొవాలి. లేకపోతే మీ గోల్ మధ్యలోనే ఆగిపోతుందని చెబుతుంది చాణక్యుడి నీతి. మీరు ఎదుగుతున్న క్రమంలో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రతి వ్యక్తి లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం లేకుండా మీరు ఏ పని చేసినా అసాధ్యం అవుతుంది. కాగా మీరు చేస్తున్న పని పట్ల మీకు స్పష్టత అనేది ఉండాలంటున్నాడు చాణక్యుడు.


Similar News