Health Tips: వీళ్లు మాత్రం పొరపాటున కూడా బెండకాయ తినకూడదు..!

బెండకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Update: 2024-11-12 12:42 GMT

దిశ, ఫీచర్స్: బెండకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ ఉన్న వారు ఎటువంటి భయం లేకుండా దీనిని తినవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు బెండకాయను తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బెండకాయ కొందరి ఆరోగ్యానికి మంచిది కాదు. వారు పొరపాటున కూడా దీనిని తినకూడదు. ఇందులో లెక్టిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది కొంతమందికి అలెర్జీని కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

వీళ్లు అస్సలు తినకూడదు:

జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలు ఉన్న వారు ఈ బెండకాయను తినకపోవడమే మంచిది. మలబద్ధకం, చిరాకు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు దీనిని తినకూడదు. ఒకవేళ తిన్నట్లైతే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.

అలెర్జీ: అలెర్జీ ఉన్నవారు బెండకాయను తస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ దీనిని తిన్నట్లైతే దురద, బొబ్బలు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

డయాబెటీస్: డయాబెటీస్ ఉన్న వారికి బెండకాయ మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కానీ, డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడానికి మందులు వాడుతున్న వారు మాత్రం దీనిని అస్సలు తినకూడదు. ఒకవేళ తినాలని అనుకుంటే వైద్యుడిని సంప్రదించండి.

కిడ్నీ సమస్య: బెండకాయను కొంతమంది పచ్చిగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ, కిడ్నీ సమస్యలు, జలుబు ఉన్నవారు బెండకాయ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను పెంచుతుంది.

ప్రయోజనాలు:

బెండకాయలో విటమిన్-ఎ, విటమిన్-సి, ఫోలెట్, విటమిన్-కె, మెగ్నీషియం, విటమిన్-బి6 లు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. బెండకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలోనూ ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News