వేగంగా ఆహారం తింటున్నారా..? తప్పనిసరిగా ఇది తెలుసుకోండి..!

మనిషి జీవితంలో ముఖ్యమైన వాటిలో ఆహారం ఒకటి.

Update: 2024-11-17 14:37 GMT

దిశ, ఫీచర్స్: మనిషి జీవితంలో ముఖ్యమైన వాటిలో ఆహారం ఒకటి. మనలో చాలామంది ఆహారాన్ని వేగంగా తింటుంటారు. అలా వేగంగా భోజనం తినకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజనం వేగంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో మార్పులు వస్తాయి. ఇది ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇలా తినడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారు. దీంతో అధిక బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

చాలామందికి ఆహారం త్వరగా తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు. కానీ, ఇలా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. వేగంగా ఆహారం తినడం వల్ల వాగస్ అనే నాడి, గుండె పనితీరును అడ్డుకునే చాన్స్ ఉంటుంది. ఇలా తరచుగా వేగంగా ఆహారం తింటే.. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. నెమ్మదిగా ఆహారం తింటున్నప్పుడు నోటిలో ఉన్న నాలుక అన్నవాహికలోకి సాఫీగా ఆహారాన్ని పంపుతుంది. వేగంగా ఫుడ్ తినడం వల్ల ఆహారం.. అన్న వాహికకు బదులుగా శ్వాసనాళంలోని వెళ్లే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది ఊపిరాకుండా చేసి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.

అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి, అజీర్ణ సమస్యలుకు కారణం అవుతుంది. వేగంగా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు ఆహారాన్ని నమిలి మింగితే, జీర్ణక్రియ పనితీరు సజావుగా సాగుతుంది.

Tags:    

Similar News