అబ్బాయిలు.. మీలో ఈ అలవాట్లుంటే సక్సెస్ కావడం కష్టమే..

ఇద్దరు పురుషులది ఒకే ఏజ్, ఒకే క్వాలిఫికేషన్.. కానీ జీవితంలో సక్సెస్ మాత్రం ఒకేలా లేదు. ఒకరు విజయాల పరంపరతో దూసుకుపోతుంటే.. మరొకరు ఓ లూప్ లో చిక్కుకుపోయి అక్కడే ఉండిపోతున్నారు. ఎదుగుబొదుగు లేని లైఫ్ ను చవిచూస్తున్నారు. ఇలాంటి వ్యత్యాసానికి కారణం దినచర్యలో ఉండే కొన్ని హానికరమైన

Update: 2024-10-21 16:35 GMT

దిశ, ఫీచర్స్ : ఇద్దరు పురుషులది ఒకే ఏజ్, ఒకే క్వాలిఫికేషన్.. కానీ జీవితంలో సక్సెస్ మాత్రం ఒకేలా లేదు. ఒకరు విజయాల పరంపరతో దూసుకుపోతుంటే.. మరొకరు ఓ లూప్ లో చిక్కుకుపోయి అక్కడే ఉండిపోతున్నారు. ఎదుగుబొదుగు లేని లైఫ్ ను చవిచూస్తున్నారు. ఇలాంటి వ్యత్యాసానికి కారణం దినచర్యలో ఉండే కొన్ని హానికరమైన అలవాట్లు మాత్రమే అంటున్నారు నిపుణులు. వీటిని గుర్తించి, వదిలించుకుంటేనే పురోగతి ఉంటుందని.. లేదంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ హ్యాబిట్స్ ఏంటి? ఎలా అవాయిడ్ చేయాలి? తెలుసుకుందాం.

ఇతరులను నిందించడం

విజయవంతం కానీ పురుషుల్లో సాధారణ లక్షణం ఇతరులను నిందించే ధోరణి. అనుకున్న పనులు సజావుగా జరగనప్పుడు ఇతరులను బ్లేమ్ చేస్తారు. ఇది జీవితంలో ముందుకు సాగకుండా చేసే అలవాట్లలో ముఖ్యమైంది. కాగా బ్లేమ్ గేమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను దూరం చేయడమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదల, అభివృద్ధిని నిరోధిస్తుంది. తప్పులు చేయడం మానవ సహజం. ఈ తప్పుల ద్వారా మనం నేర్చుకుంటాం. పెరుగుతాం. విజయవంతమైన పురుషులు వారి తప్పులకు బాధ్యత వహిస్తారు. పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతారు.

విజయం సాధిస్తారు. అందుకే ఇతరుల వైపు వేళ్ళు చూపడం మానేసి.. తప్పు ఒప్పుకోవడం ప్రగతికి తొలిమెట్టు అవుతుందని అంటున్నారు నిపుణులు.

పనుల వాయిదా

పనులను వాయిదా వేయడం అనేది సౌకర్యంగానే ఉంటుంది. కానీ మరిన్ని తప్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జామ్ ఫీ కట్టేందుకు ఇంకా గడువు ఉందని లైట్ తీసుకుంటాం. తీరా చివరి తేదీ వచ్చాక పని జరుగుతుందో లేదో అని ఒత్తిడికి లోనవుతాం. పోస్ట్ పోన్ చేయడమనేది భవిష్యత్ పని భారాన్ని పెంచుకోవడమే కాకుండా.. లాస్ట్ మినిట్ లో హడావిడి చేయడం వల్ల తప్పులు జరిగే అవకాశాలను పెంచుతుంది. విజయవంతం కానీ పురుషులు ఎక్కువగా ఈ ఉచ్చులో చిక్కుకుంటారు. ఇందుకోసం మంచి సమయం, మానసిక స్థితి అంటూ వెయిట్ చేస్తారు. కానీ నిజానికి ఇలాంటి ఖచ్చితమైన సమయం అంటూ ఏమీ ఉండదు. అందుకే అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూడకుండా ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకొని పనులు పూర్తి చేసేవారినే విజయం వరిస్తుంది.

మార్పు భయం

జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ సైకాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. మానవులు యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికే ఇష్టపడుతారు. మార్పు వల్ల కలిగే లాభాల గురించి కాకుండా నష్టాల గురించే ఎక్కువగా ఆలోచించడం ఇందుకు కారణం. విజయవంతం కాని పురుషులు తరచుగా ఈ మార్పు భయంతోనే స్తంభించిపోతారు. వృద్ధికి దారితీసే కొత్త అవకాశాలను స్వీకరించడం కంటే కంఫర్ట్ జోన్‌లలో ఉండటానికి ఇష్టపడతారు. కానీ జీవితంలో ముందుకు సాగాలంటే.. ఈ భయాన్ని అధిగమించడం చాలా అవసరం. మార్పు అనివార్యం... అనుకూలించినవారే అభివృద్ధి చెందుతారు.

లక్ష్యాలు లేకపోవడం

విజయం అనేది సంకల్పం, కృషితో కూడిన స్పష్టమైన లక్ష్యాల ఫలితం. కాగా దురదృష్టవశాత్తు విజయవంతం కాని పురుషులు తరచుగా జీవితంలో నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉండరు. మనసులో స్పష్టమైన గమ్యం లేకుండా ప్రయాణిస్తే దారిలో తప్పిపోవడం సులభం. సాధించగల, సమయ పరిమితితో కూడిన లక్ష్యాలను కలిగి ఉండటం.. దిశను అందించడమే కాకుండా కోరుకున్న ఫలితం వైపు ప్రేరేపిస్తుంది. మార్గనిర్దేశం చేస్తుంది. విజయవంతం కాని పురుషులు అస్పష్టమైన ఆకాంక్షలు, కోరికలను కలిగి ఉండవచ్చు, కానీ సరైన లక్ష్యాలుగా పటిష్టం చేయలేరు. ఫలితంగా జీవితంలో గణనీయమైన పురోగతిని సాధించడానికి కష్టపడతారు.

పర్ఫెక్ట్ గా ఉండాలనే ఆలోచన

పర్ఫెక్షన్ అనేది ఉన్నత ప్రమాణాలు, కృషికి సంకేతం అని అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఇది సక్సెస్ కు ముఖ్యమైన రోడ్‌బ్లాక్ లాంటిది. విజయవంతం కాని పురుషులు తరచుగా పరిపూర్ణత సాధనలో చిక్కుకుంటారు. ప్రతి విషయంలో తప్పులు లేకుండా చేయడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తారు. తద్వారా పెద్దగా సాధించలేరు.

పరిపూర్ణత అనేది ఒక భ్రమ. అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ స్థలం ఉన్నందున ఇది సాధించడం అసాధ్యం. అంతకన్నా ముఖ్యమైనది పురోగతి. పర్ఫెక్ట్ గా ఉండాలనే ప్రయత్నంలో అంతులేని లూప్‌లో చిక్కుకోవడం కంటే పనులను పూర్తి చేయడం, లోపాల నుంచి నేర్చుకోవడం ఉత్తమం.

ఆత్మవిశ్వాసం లేకపోవడం

ఆత్మవిశ్వాసంలేని వారు తమ సామర్థ్యాలను అణగదొక్కుతారు. చేయగలమో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ సెల్ఫ్ డౌట్ కొత్తగా ప్రయత్నించాడన్ని అడ్డుకుంటుంది. వైఫల్యానికి దారితీస్తుంది. మిమ్మల్ని మీరు విశ్వసించడం అంటే మీరు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని కాదు కానీ అవకాశాలను తీసుకోవడానికి, పట్టుదలతో ఉండటానికి ధైర్యాన్ని ఇస్తుంది. విజయవంతమైన ప్రయత్నానికి ఇదే మూలస్తంభం. కాగా మిమ్మల్ని మీరు నమ్మడం విజయానికి తొలిమెట్టు లాంటిది అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News