Food Allergy : ఫుడ్ అలర్జీని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
ఫుడ్ అలర్జీ అనేది సాధారణంగా ఆహారం తిన్న తర్వాత ఈ సమస్య వేధిస్తుంటుంది.
దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ అలర్జీ అనేది సాధారణంగా ఆహారం తిన్న తర్వాత ఈ సమస్య వేధిస్తుంటుంది. మనం తీసుకునే ఆహార పదార్ధాలలో అన్ని ఆహారాలు ఒకేలా జీర్ణం కావు. అవి సరిగా జీర్ణం కాక కడుపు సమస్యలు, దద్దుర్లు, అలర్జీల వంటి సమస్యలు వస్తాయి. ఈ ఫుడ్ అలర్జీ వల్ల ఎక్కువగా దురద, ఎరుపు దద్దుర్లు , మింగడం కష్టంగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, కళ్లు తిరగడం, కళ్లు దురద వంటి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
నిపుణులు పరిశోధనలు చేసి అలర్జీలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ఇది ఒకేసారి తగ్గదట.. కొన్నేళ్లు దాటిన తర్వాత ఇది క్రమంగా తగ్గిపోతుందని వెల్లడించారు. మనలో కొంతమందికి పల్లీలు తిన్నా కూడా పడవు. ఎందుకంటే ఈ సోయా ఉత్పత్తులు కొందరికి అలర్జీ వస్తుంది. అలాగే గోధుమ లోని ప్రొటీన్లు అలర్జీకి కారణం కావచ్చు.
పొట్ట సమస్యలు ఉన్నవారు గోధుమలకు దూరంగా ఉండాలి. ఈ సమస్య వంశ పారంపర్యంగా వస్తుందట. ఇలాంటి సమయంలో నిమ్మరసం తీసుకుంటే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది పుడ్ అలర్జీని పూర్తిగా నివారిస్తుంది. ఇంకా గ్రీన్ టీ, క్యారట్, విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల అలర్జీ తగ్గుతుంది..
Read More : ఉడికించిన పెసలు తినడం మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే