వందేళ్లకు కనిపించిన అత్యంత అరుదైన పక్షి.. సగం ఆడ, సగం మగ!

సగం ఆడ, సగం మగ లక్షణాలున్న పక్షిని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? సాధారణంగా అయితే ఎవరు చూసి ఉండరు.

Update: 2024-01-05 08:56 GMT

దిశ, ఫీచర్స్: సగం ఆడ, సగం మగ లక్షణాలున్న పక్షిని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? సాధారణంగా అయితే ఎవరు చూసి ఉండరు. గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కొలంబియాలో యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఈ పక్షులు సగం బ్లూ, మరో సగం ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇది గ్రీన్ హనీ క్రీపర్, కానీ ఇది సాధారణ వాటికి భిన్నంగా కనిపిస్తుంది.

సాధారణ మగ హనీక్రీపర్లు నల్లటి తలతో బ్లూ కలర్‌లో ఉంటాయి, సాధారణ ఆడ హనీక్రీపర్లు మొత్తం ఆకుపచ్చగా ఉంటాయి. అయితే తాజాగా కనిపించిన పక్షి శరీరం ఒక వైపు బ్లూ ఈకలు, మరొక వైపు ఆకుపచ్చ ఈకలు కలిగి ఉంది. ఎందుకంటే ఇందులో మగ, ఆడ జన్యువులు ఉన్నాయి. అంటే ఈ పక్షి సగం మగ, సగం ఆడ లక్షణాలను కలిగి ఉంది. పక్షి గుడ్డు రెండు భాగాలను కలిగి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఒకటి మగ జన్యువుతో, ఒకటి స్త్రీ జన్యువుతో తయారైనప్పుడు ఇది సంభవిస్తుందని, అప్పుడు రెండు మగ స్పెర్మ్‌లు అండంతో కలిసి రెండు రకాల జన్యువులతో పక్షిని తయారు చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తాను ఇంతవరకు చూడలేదని, ఇది చాలా అద్భుతమైన విషయమని ఫ్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు.

ఇలాంటివి చూడటం చాలా అరుదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. వందేళ్ల క్రితం క్రితం ఇలాంటి పక్షిని చివరిసారి చూశారు. మళ్లీ ఇప్పుడు మనుషుల కంటికి కనిపించిందని జాన్ మురిల్లో అనే వ్యక్తి నేచర్ రిజర్వ్‌లో ఈ పక్షిని కనుగొన్నాడు. ఈ పక్షి సాధారణ హనీ క్రీపర్ లాగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. 100 ఏండ్లలో కనిపించిన అనేక పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదేనని చెప్పారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఈ రకమైన పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండు సార్లు ఫలదీకరణం చెందితే ఈ విధంగా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వెల్లడించారు.


Similar News