60 శాతం మంది మహిళల్ని వేధిస్తున్న నిద్రలేమి సమస్య.. రీ ప్రొడక్టివ్ హెల్త్‌పైనా ప్రభావం..

కంటి నిండా నిద్రపోతేనే ఆనందగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ బిజీ లైఫ్ అండ్ వర్క్ షెడ్యూల్, మానసిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు వంటివి పలువురిలో ఈ పరిస్థితిని దూరం చేస్తున్నాయి.

Update: 2024-04-19 07:25 GMT

దిశ, ఫీచర్స్ : కంటి నిండా నిద్రపోతేనే ఆనందగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ బిజీ లైఫ్ అండ్ వర్క్ షెడ్యూల్, మానసిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు వంటివి పలువురిలో ఈ పరిస్థితిని దూరం చేస్తున్నాయి. దీంతో కొందరు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో అత్యధిక మంది సఫర్ అవుతున్నారని హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, సౌత్ ఆప్టన్ యూనివర్సిటీకి చెందిన ఉమెన్ రీసెర్చర్స్ అధ్యయనంలో వెల్లడైంది.

 కారణాలు

మానవులు ఎదుర్కొనే అనేక సమస్యలు నిద్రలేమితో ముడిపడి ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం, అత్యధిక సమయం కంప్యూటర్ల ముందు వర్క్ చేయడం, అందులోనూ నైట్ షిప్టుల్లో చేయడం, మూన్‌లైట్ వర్క్ కల్చర్ వంటివి ఆలస్యంగా నిద్రపోవడానికి కారణం అవుతున్నాయి. చాలామంది రోజుల తరబడి మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్న పరిస్థితి ఫారెన్ కంట్రీస్‌లో ఎక్కువగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగానూ నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో పురుషులకంటే స్త్రీలే అధికంగా, 60 శాతం మంది ఉంటున్నారని తాజా అధ్యయనం పేర్కొంటున్నది.

 పర్యవసనాలు

సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల స్ట్రెస్, హైపర్ టెన్షన్, యాంగ్జైటీస్, డయాబెటిస్, ఒబేసిటీ, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్‌‌తోపాటు స్త్రీ, పురుషుల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే పురుషులకంటే నిద్రలేమి సమస్య మహిళలపై ఎక్కువ ప్రభావం చూపడానికి పలు కారణాలు ఉన్నాయి. వాస్తవానికి స్త్రీ శరీర జీవగడియారం, పురుషులతో పోల్చినప్పుడు 6 నిమిషాలు అధిక వేగంతో నడుస్తుందట. అందువల్ల నిద్రలేమి, దానివల్ల తలెత్తే పర్యవసనాలు స్త్రీలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతున్నాయి.

రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై ప్రభావం

నిద్రలేమి సమస్య స్త్రీ, పురుషుల్లో రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై పరోక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే మహిళల్లో జీవగడియారం వేగంగా ఉంటుంది. కాబట్టి వీరిపై కాస్త ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, నిద్రకు మధ్య లింక్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మెటలోనిన్ అనే హార్మోన్ క్వాలిటీ స్లీప్‌తో పాట, శరీర జీవగడియారాన్ని నడిపిస్తుంది. అందుకే నిద్ర విషయంలో, జీవగడియారం విషయంలో సమతుల్యత లోపించినప్పుడు ఆ ప్రభావం రీ ప్రొడక్టివ్ ఆర్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది సంతానలేమి సమస్యకు కారణం అవుతుంది. దీనికి ఏకైనా నివారణ మార్గం క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేయడమేనని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం నిద్రకు ఆటంకం కలిగించే జీవన శైలిని, అలవాట్లను మార్చుకోవాలి.


Similar News