హైబ్రిడ్ హ్యూమన్: మానవ మూలకణాలను కోతి పిండాల్లోకి ఇంజెక్ట్
చైనా శాస్త్రవేత్తలు హైబ్రిడ్ హ్యూమన్‌ను విజయవంతంగా సృష్టించారు.
దిశ, ఫీచర్స్: చైనా శాస్త్రవేత్తలు హైబ్రిడ్ హ్యూమన్‌ను విజయవంతంగా సృష్టించారు. ఈ భయానక పరిణామం 2021లోనే జరిగినట్లు తెలుస్తోంది. మానవుడు-కోతి కలయికలో ఈ ప్రయోగం జరగ్గా.. మనుషుల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అవయవాలను ఉత్పత్తి చేయడానికి జంతువులను ఉపయోగించాలనే దీని ఉద్దేశం. కాగా శాస్త్రవేత్తల ప్రణాళికలో హైబ్రిడ్ సృష్టి ఒక కీలకమైన దశ. కాగా పరిశోధన బృందం మానవ మూలకణాలను కోతి పిండాలలోకి విజయవంతంగా ఇంజెక్ట్ చేశారని, ఈ పిండాలలో కొన్ని నైతిక పరిశీలనల కారణంగా నాశనం చేయబడటానికి ముందు 20 రోజుల వరకు జీవించి ఉన్నాయని నివేదించారు. అయితే జంతువు మెదడులో మానవ న్యూరాన్‌లను అభివృద్ధి చేయగలగడం వినాశానానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి ప్రయోగాలను చాలా దేశాల్లో బ్యాన్ చేశారని, కానీ చైనా మాత్రం దీన్ని కొనసాగిస్తుందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రయోగాలు విజయవంతం అవుతాయా? మనుషుల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఉపయోగపడతాయా? అనేది పక్కన పెడితే ఇక్కడ మరో నైతిక ప్రశ్న ఎదురవుతోంది. జంతువులను ఇలాంటి ప్రయోగాలకు ఉపయోగించి ఇబ్బంది పెట్టడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఇదే కొనసాగితే మనిషి జీవితకాలం పెరుగుతుందని, మరణం లేకుండా ప్రపంచాన్ని శాసిస్తాడని హెచ్చరిస్తున్నారు.