చికెన్ లాంటి టేస్ట్.. మటన్ లాంటి ఎనర్జీ.. ఈ గ్రీన్ వెజిటేబుల్ గురించి తెలుసా?

గ్రీన్ వెజిటేబుల్స్ సహజంగానే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. సీజనల్‌గా వచ్చే ఆకుకూరలు, గాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తారు.

Update: 2024-06-07 12:50 GMT

దిశ, ఫీచర్స్ : గ్రీన్ వెజిటేబుల్స్ సహజంగానే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. సీజనల్‌గా వచ్చే ఆకుకూరలు, గాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తారు. అయితే వర్షాకాలంలో ఎక్కువగా అందబాటులో ఉండే ఒక ఆకుపచ్చని కాకరకాయ మాత్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. చిన్నగా, గుండ్రంగా, పైభాగంలో ముళ్ల మాదిరి ఆకారం కలిగి ఉండే ఈ కూరగాయను వండి తింటే చికెన్ లాంటి టేస్ట్.. మటన్ లాంటి ఎనర్జీని ఇస్తుందట. తెలంగాణ ప్రాంతంలో అడవి కాకరగాయగా పిలుస్తారు.

భారత దేశం అంతటా అడవి కాకరకాయ లభిస్తుంది. కొన్నిచోట్ల రైతులు సాగు చేస్తారు. చాలా వరకు అడవులు, వ్యవసాయ పొలాల్లోని పొదల్లో సహజంగా పెరిగే ఒక రకమైన తీగలకు ఇది కాస్తుంది. ఆయా ప్రాంతాల వారీగా దీనిని ఆ కాకర కాయ అని, ఆదొండ కాయ అని, కంకరోల్ అని ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో అడవి కాకర కాయ అంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. వండుకొని తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, తలనొప్పి, చెవినొప్పి, పక్షవాతం వంటి అనారోగ్య సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. రక్త హీనతను దూరం చేస్తుంది కాబట్టి గర్భిణులు తప్పక తినాలని చెప్తుంటారు. 


Similar News