వీటిని తీసుకుంటే లోబీపీ సమస్యకు చెక్ పెట్టొచ్చు
రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
దిశ, ఫీచర్స్: సరైన ఆహారం , జీవనశైలి ఎంపికల వల్ల కలిగే అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి. ఇది చాలా ప్రమాదకరం. ఈ రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
మనిషి ఆరోగ్యం అనేది ముఖ్యంగా రక్తపోటు ను బట్టి ఉంటుంది. శరీరంలో రక్త పోటు సాధారణంగా ఉన్నంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో లేనప్పుడు, ప్రమాదకరంగా మారుతుంది. చాలా మంది అధిక రక్తపోటు గురించి చర్చిస్తారు. కానీ లోబీపీ కూడా మరో ప్రదాన సమస్య అని గుర్తించరు. సాధారణ రక్తపోటు120-80 ఉంటుంది. అదే 90-60 ఉంటే అది హైపర్ టెన్షన్ కావచ్చు. ఈ పరిస్థితుల్లో గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. అందువల్ల, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి కొన్నింటిని అలవాటు చేసుకోవాలి.
నీరు
మీ శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మీ రక్తపోటు కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ 2 నుంచి 3 లీటర్ల నీటిని త్రాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం కానీ నీరు త్రాగడం ద్వారా బాడీ హైడ్రేటెడ్ గా ఉండండి
ఉప్పు
లోబిపితో బాధపడేవారు ఖచ్చితంగా ఉప్పు తీసుకోవాలి. రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి, చిటికెడు ఉప్పుతో నిమ్మరసం త్రాగాలి. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
బాదం
బాదం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. బాదం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ప్రతి రోజూ సాయంత్రం బాదంపప్పు తినడం వల్ల మీ రక్తపోటు అదుపులో ఉంటుంది.