ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్‌‌‌కు ఏది కారణం..?

గర్భధారణ తర్వాత వివిధ సమస్యలకు బాధితుల వయస్సుతో లింకు పెడుతుంటారు కొందరు.

Update: 2023-05-22 11:19 GMT

దిశ, ఫీచర్స్: గర్భధారణ తర్వాత వివిధ సమస్యలకు బాధితుల వయస్సుతో లింకు పెడుతుంటారు కొందరు. 20 ఏళ్లలోపు ప్రెగ్నెంట్ కావడంవల్ల సమస్య ఏర్పడిందని కొందరు, లేకపోతే వయస్సు 30 దాటాక ప్రెగ్నెన్సీ రావడంతో ఇబ్బందులు ఎదురవుతాయని ఇంకొందరు అంటుంటారు. వాస్తవం ఏంటంటే.. గర్భధారణ తర్వాత వచ్చే సమస్యలు దాదాపు ఏజ్‌తో సంబంధం లేనివే ఉంటాయని, అంతకు ముందు సదరు మహిళల ఆరోగ్యాన్ని బట్టి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుంటాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. అంటే ప్రెగ్నెన్సీకి ముందు పేలవమైన ఆరోగ్యం(poor health) కలిగి ఉండటమే తర్వాత సమస్యలకు ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రెగ్నెన్సీకి ముందు ఒబేసిటీ, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్ వంటివి ఉండటం గర్భంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు.

పరిశోధకుల ప్రకారం.. గత దశాబ్దంలో ప్రెగ్నెన్సీ డిజార్డర్స్‌లలో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఉంటోంది. ఏజ్ రిలేటెడ్ మార్పులు పరిశీలించినప్పుడు ఈ పెరుగుదలలో రెండు శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఈ కొత్త డేటా పిల్లల్ని కనాలని ఆలోచిస్తున్న మహిళల్లో సంభవిస్తున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి దోహదం చేస్తుంది. 2011లో నిర్వహించిన స్టడీ ప్రకారం.. గర్భిణి సగటు వయస్సు 27.9 సంవత్సరాలు కాగా, 2019లో 29.1 సంవత్సరాలకు పెరిగింది.

అయినప్పటికీ గర్భిణుల సగటు వయస్సు పెరుగుదల అదే కాలంలో ప్రతికూల గర్భధారణ ఫలితాల పెరుగుదలలో స్వల్ప నిష్పత్తికి మాత్రమే కారణమైంది. ఇందుకు సంబంధించిన డేటాను పరిశోధకులు నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ నేటాలిటీ ఫైల్స్( Natality Files) నుంచి విశ్లేషించారు. 2011 - 2019లలో దాదాపు నాలుగు మిలియన్ల జననాలలో ప్రీక్లాంప్సియా, ఎక్లాంప్సియా (pregnancy-related high blood pressure disorders), అకాల జననాలు(premature births), తక్కువ బరువుతో జననాల(low birth weights ) రేట్లను పోల్చారు. అయితే ఈ కాలంలో అకాల జననాలు, తక్కువ బరువుతో జన్మించడం రెండింటిలోనూ స్వల్ప పెరుగుదలను, అలాగే బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ డిజార్డర్స్‌లో నాటకీయంగా 52 శాతం పెరుగుదలను అధ్యయనకర్తలు గమనించారు.

‘‘ప్రసవించే మహిళ వయస్సు రీత్యా ఎక్కువ ఏజ్ కలిగి ఉన్నా కూడా ప్రతికూల జనన ఫలితాలకు కారణం కాదు. నిజంగా దీన్ని నడిపించేది డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి గర్భధారణకు ముందున్న ఆరోగ్య సమస్యలు మాత్రమే. ముందు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం’’ అంటున్నారు చికాగోలోని నార్త్‌వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు, ఫిజిషియన్, అధ్యయన కర్త డాక్టర్ జాచరీ హ్యూస్. అంతేగాక పుట్టుకతో వచ్చే సమస్యలు తల్లి, బిడ్డ ఇద్దరికీ ముఖ్యమైన ఆరోగ్య పర్యవసానాలకు దారి తీయవచ్చని చెప్పారు. ఇందులో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుందని, ప్రతికూల ఫలితాలను నివారించడంలో, భవిష్యత్తులో హృదయనాళ ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడంలో తమ పరిశోధన ప్రాముఖ్యత వహిస్తుందని అతను పేర్కొన్నాడు.

అయితే చాలా మంది వ్యక్తులు గర్భం దాల్చే వరకు డాక్టర్‌ను సంప్రదించరు. ఇది కూడా తర్వాత సమస్యలకు కారణం అవుతోంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్‌కంటే ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం ముందు నుంచి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. గర్భధారణ తర్వాత, ప్రసవ సమయంలో ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది. ప్రతికూల గర్భధారణ ప్రభావాలను నివారించవచ్చు. డయాబెటిస్ లేదా హై బ్లడ్ ప్రెషర్‌తో సహా గర్భధారణకు ముందు ఆరోగ్య పరిస్థితులను నిర్వహించే ప్రాముఖ్యతను అధ్యయనం నొక్కి చెబుతోంది.

Also Read..

ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. పడుకునేముందు ఈ డ్రింక్ తీసుకోండి

Tags:    

Similar News